రాష్ట్రీయం

సాగుకు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి ప్రపంచ ఆర్థిక వేదిక మద్దతు తెలిపింది. వ్యవసాయ రంగంలో ఉత్తమ సాగు విధానాల అధ్యయనం, అమలుకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. సదస్సు నాలుగోరోజు ‘వ్యవసాయంలో కొత్త దృక్కోణం: నవీన కార్యాచరణ’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న చంద్రబాబు ఎపిలో కొనసాగుతున్న వ్యవసాయ విధానాలను వివరించారు. వ్యవసాయ రుణాల ఉపశమనం, రైతు సాధికార సంఘం ఏర్పాటు, ఇన్‌పుట్ సబ్సిడీ అందజేత, సాగునీటి రంగంలో పురోగతి, గోదావరి-కృష్ణ నదుల అనుసంధానం, పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడం, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు వంటి ముఖ్యమైన అంశాలను చర్చాగోష్టిలో ప్రస్తావించారు. ఇందుకు స్పందించిన వేదిక ఎపిలో తమ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు సిఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఉత్తమ వ్యవసాయ విధానాలను ఎపిలో ప్రవేశపెట్టేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఆర్ధిక వేదిక దృష్టిసారించిందని తెలిపింది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఫసిఫిక్ ప్రాంతాలలో ప్రస్తుతం అనుసరిస్తున్న సాగు విధానాల పరిశీలనకు సబ్‌గ్రూప్‌లను ఏర్పాటు చేయనుందని సిఎం కార్యాలయం వర్గం వెల్లడించింది. అగ్రికల్చర్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటుతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెంచగలిగిన ఇథియోపియా ప్రధానిని సిఎం కొనియాడారు.
యాంట్వెర్ప్ ఫోర్ట్ అథారిటీ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో పోర్టుల అభివృద్ధికి సిద్ధమని యాంట్వెర్ఫ్ పోర్ట్ అథారిటీ ముందుకొచ్చింది. చంద్రబాబు చేసిన విజ్ఞప్తి మేరకు బెల్జియంకు చెందిన యాంట్వెర్ప్ సిఈఓ బ్రూనిక్స్ ఎపిలో పోర్టుల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. పోర్టులను కేవలం సరుకు రవాణాకే పరిమితం చేయకుండా అంతకుమించి లాభదాయకంగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని బ్రూక్స్ తెలిపారు. సిఎం చంద్రబాబుతో రీ ఇన్సూరెన్స్ కంపెనీ ‘స్విస్ రె’ ఎండి మార్టిన్ పార్కర్ కూడా చర్చలు జరిపారు. తుపాన్ వైపరీత్యాలతో వాటిల్లే నష్టానికి బీమా కల్పించడంపై మార్టిన్ పార్కర్ ఆసక్తి చూపించారు. సిఎం చంద్రబాబుతో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిన్ లికున్ భేటీ అయ్యారు. ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటే అందుకు తగిన ఆర్థిక సహకారాన్ని అందిస్తామని జిన్‌లికున్ ముందుకొచ్చారు. రాష్ట్రానికి త్వరలో బృందాన్ని పంపి అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీతో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎపిలో ప్రవేశపెడుతున్న డిజిటల్ ఆవిష్కరణలను వివరించారు. తాము తీసుకు వచ్చిన ఇ-ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పి, దీనిలో భాగస్వాములు కావాలని ప్రేమ్‌జీని కోరారు. రోనాల్డ్ బర్గర్ కంపెనీ గ్లోబల్ సీఈఓ చార్లెస్ ఎడ్వర్డ్ ఏరో స్పేస్, రక్షణ రంగాల్లో తమ ప్రతిభను సిఎం చంద్రబాబుకు వివరించారు. రోనాల్డ్ బర్గర్ ప్రతినిధులను అమరావతికి రావాల్సిందిగా సిఎం వారిని ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో సిఎం చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.