తెలంగాణ

సతుల తరఫున పతుల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ‘మా ఆవిడకు ఓటు వేయండి, మీకు ఏం పనులున్నా అడగండి, నేను చేయిస్తా’..ఇదీ నగరంలో చాలాచోట్ల విన్పిస్తున్న మాట. జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచార నేపథ్యంలో అన్ని పార్టీల నేతల తీరు ఇదే. ఈసారి జిహెచ్‌ఎంసి ఎన్నికలల్లో ఎన్నడూ లేనివిధంగా 150 డివిజన్లలో సగం మహిళలకు రిజర్వు చేశారు. దీంతో 75 డివిజన్లలో మహిళా అభ్యర్థులు తలపడుతున్నారు. కనీసం ఒక్కో డివిజన్ నుంచి ఐదుగురు, ఆరుగురు మహిళా అభ్యర్థుల చొప్పున 75 డివిజన్ల నుంచి సుమారు నాలుగు వందల బరిలో నిలిచారు. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారు తక్కువే. కొత్తగా బరిలోకి దిగినవారిలో ఎక్కువమంది నేతల బంధువులే. తమకు పోటీచేసే అవకాశం రాని నేతలు తమ పిల్లలు, భార్య, బంధువులను బరిలోకి దింపారు. వారి తరపున ప్రచార బాధ్యతలూ వారే తీసుకున్నారు. కొత్త అభ్యర్థుల్లో 90శాతం మందికి రాజకీయాలు కొత్తే. ఇన్నాళ్లూ ఇంటిపట్టున ఉన్నవారు ఇప్పుడు వీధుల్లోకి వస్తున్నారు. ఏ హామీ ఇవ్వాలో తెలియక నమస్కారం పెట్టి మమ అన్పిస్తున్నారు. వారితోపాటు తిరుగుతున్న భర్త, బంధువులే ఓటర్లకు హామీలు ఇస్తూ ముందుకు సాగిపోతున్నారు.