బిజినెస్

క్షీణించిన ఇంజినీరింగ్ ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: దేశీయ ఇంజినీరింగ్ ఎగుమతులు గత నెల డిసెంబర్‌లో 16 శాతం క్షీణించి 5.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2014 డిసెంబర్‌లో ఇవి 6.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిసెంబర్‌లో భారత ఎగుమతులు 15 శాతం పడిపోయి 22.2 బిలియన్ డాలర్లుగా ఉన్నది తెలిసిందే. కాగా, దేశీయ ఇంజినీరింగ్ ఎగుమతుల్లో యూరోపియన్ సమాజం వాటా 17 శాతంగా ఉంటే, ఉత్తర అమెరికా వాటా 15 శాతంగా ఉంది.