బిజినెస్

శ్రీసిటీలో వ్యర్థ నీటి శుద్ధి కర్మాగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జనవరి 22: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీసిటీలో శుక్రవారం పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన నీటిని శుద్ధిచేసే యంత్ర పరికరాల కర్మాగారానికి భూమి పూజ నిర్వహించారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నెదర్లాండ్స్ పక్యూస్ గ్రూపునకు చెందిన పక్యూస్ ఎన్విరానిమెంట్ టెక్నాలజీ ఇండియా పేరుతో శ్రీసిటీలో కర్మాగారాన్ని నిర్మించ తలపెట్టామని సంస్థ కంట్రోలర్ శుభ గణేషన్ తెలిపారు. ఈ భూమిపూజలో శ్రీసిటీ సంచాలకులు ముకుంద రెడ్డి, భద్రతా విభాగం జనరల్ మేనేజర్ అల్త్ఫా పాల్గొన్నారు. ఈ పరిశ్రమను రెండెకరాల స్థలంలో తొలి దశ ఉత్పత్తి కేంద్రానికి 30 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ జూలై కల్లా రియాక్టర్లు ఉత్పత్తిలోకి వస్తాయని, తద్వారా 75 మందికి ఉపాధి కలుగుతుందని సంస్థ అధికారి తెలిపారు.