బిజినెస్

సంస్కరణలతో ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డావోస్, జనవరి 22: సంస్కరణలు, బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రణాళికల ద్వారా ప్రస్తుత అంతర్జాతీయ మందగమనాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశా రు. అమెరికా, చైనాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న అనిశ్చితిని భారత్ ఎలా ఎదుర్కోనుందన్న దానిపై శుక్రవారం జైట్లీ ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యుఇఎఫ్) సమావేశాల్లో స్పందించారు. నిరంతర సంస్కరణలు, క్రమశిక్షణ కలిగిన ఆర్థిక ప్రణాళికతో ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ భారత్ వృద్ధిపథంలో పయనించగలదన్నారు. ఇంతకుముందు 2001, 2008, 2015ల్లో అంతర్జాతీయ ఆర్థిక మందగమనాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని గుర్తుచేశారు. అయితే గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను అమెరికా ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలు ప్రపం చ ఆర్థిక వ్యవస్థను కలవరపాటుకు గురిచేస్తున్నాయని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, లోహ, కమోడిటీ ఉత్పత్తి దేశాలు ఎదుర్కొంటున్న తీవ్ర ప్రతికూల పరిస్థితులు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఈ కారణాలతోనే వివిధ దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయని, స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయని, కరెన్సీ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయన్నారు.