హైదరాబాద్

సమన్వయ లోపం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, జిహెచ్‌ఎంసి అధికారుల మధ్య సమన్వయలోపం ఏర్పడింది. ఇందుకు ఇప్పటివరకు అధికారులు ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చేపట్టిన నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత 18న నిర్వహించిన నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత ఉపసంహరణ ప్రక్రియలకు సంబంధించి అధికారులు తప్పులతడకగా వెల్లడించిన వివరాలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. పైగా నామినేషన్ల పర్వం మొదలైన 12వ తేదీ, ఆ తర్వాత 13వ తేదీ రెండురోజుల పాటు ఒక రోజు 14, మరో రోజు 75 నామినేషన్లను స్వీకరించామంటూ అధికారులు వెల్లడించిన సమాచారం వరకు అంతా సక్రమంగా జరిగిపోయింది. ఆ తర్వాత 17వ తేదీ వరకు మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్ల స్వీకరణ చేపట్టిన డివిజన్ల స్థాయిలో నియమితులైన రిటర్నింగ్ అధికారులు సకాలంలో ప్రధాన కార్యాలయానికి సమాచారమివ్వకలేపోవటంతో అధికారులు వెల్లడించే సమాచారంలో ఎప్పటికపుడు అంకెలు చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం అధికారులు నామినేషన్ల ఉపసంహరణ జోరుగా సాగుతున్న సమయంలో ఒక రోజు మొత్తం నామినేషన్లు 4069 అని ప్రకటించి, ఆ మరుసటి రోజే వాటి సంఖ్యను 4039గా వెల్లడించారు. దీంతో వీటిలో అసలు అంకె ఏమిటోనన్న అయోమయం తలెత్తింది. ఆ తర్వాత మొత్తం 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత గురువారం రాత్రి ఎనిమిది గంటలకు విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులు వెల్లడించిన వివరాలు సైతం అసంపూర్తిగానే ఉన్నాయి. ఆమోదయోగ్యంగా ఉన్న మొత్తం 2713 నామినేషన్లలో 1214 ఉపసంహరించుకున్న తర్వాత బరిలో ఉన్న నామినేషన్ల సంఖ్యను 1499గా వెల్లడించారు. కొన్ని డివిజన్ల నుంచి ఇంకా ఉపసంహరణకు సంబంధించి సమాచారం రాలేదని, ప్రస్తుతమిస్తున్న సమాచారంలో ఒకటి రెండు శాతం వ్యత్యాసం వచ్చే అవకాశముందని కమిషనర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. రాత్రి ఒకట్నినర గంటల సమయంలో మొత్తం 150 డివిజన్లకు గాను 1333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటన జారీ చేయటం అయోమయానికి గురి చేసింది. కానీ సకాలంలో సమాచారం పంపటంలో కాస్త లోపాలు ఏర్పడిన విషయాన్ని కమిషనర్ అంగీకరించిన నేపథ్యంలో శుక్రవారం అధికారులు ఎన్నికల సంఘం నుంచి వివరాలు తెప్పించుకుని అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించారు. అందులోనూ టిఆర్‌ఎస్ అభ్యర్థుల సంఖ్య 150 డివిజన్లకు 151గా పేర్కొన్నారు. ఆ తర్వాత అది టైపింగ్ మిస్టేక్‌గా గుర్తించి 150గా నిర్థారించారు.
అన్నీ ఉన్నా..ఎందుకంత ఆలస్యం
గ్రేటర్‌లోని మొత్తం 150 డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌కు ఒకరు, కొన్ని డివిజన్లను కలిపి ఓ రిటర్నింగ్ అధికారులను నియమించారు. వారికి, వారి కింది సిబ్బందికి సైతం ప్రత్యేకంగా ఆఫీసులను కేటాయించి, కావల్సిన కంప్యూటర్, ఆపరేటర్, ప్రింటర్, ఇంటర్నెట్ సౌకర్యం వంటివి కెటాయించినా, ప్రతిరోజు మూడు గంటలకు నామినేషన్ల దాఖలు, ఉపసంహరణలు వంటి ప్రక్రియలు ముగిసినా, కనీసం స్వీకరించి, తిరస్కరించిన నామినేషన్ల వివరాలు రాత్రి ఏడు గంటల వరకు కూడా ప్రధాన కార్యాలయానికి రాకపోవటం శోచనీయం.