Others

ప్రాణాలను తోడేస్తున్న వాయుకాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ న దేశంలో ప్రజలు పీల్చేగాలి నానాటికీ విషపూరితమవుతోందని, ఫలితంగా సగటున నిమిషానికి ఇద్దరు మరణిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఏటా పది లక్షల మందికి పైగా భారతీయులు వాయు కాలుష్యంతో మృత్యువాత పడుతున్నారనీ, ప్రపంచంలోనే అత్యధికంగా కలుషితమైన నగరాలలో కొన్ని భారత్‌లో ఉన్నాయనీ ‘ది లానె్సట్’ మెడికల్ జర్నల్ పేర్కొంది. ‘ది లానె్సట్ కౌంట్‌డౌన్’ పేరుతో ఆ జర్నల్ ఏటా నివేదికను వెలువరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 16 ప్రముఖ విద్యా సంస్థలు ఈ అధ్యయనంలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్, త్సింగ్వా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ సెక్యూరిటీ వంటివి ఇందులో ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు తమ పరిశోధనలకు అవసరమైన సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా సేకరిస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థలతో కూడా ‘ది లానె్సట్’కి సహకార భాగస్వామ్యం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో పిల్లలు నెలలు నిండక ముందే పుట్టారని, ఇందుకు వాయు కాలుష్యం ఓ కారణమని 2010లో సేకరించిన సమాచారం ఆధారంగా ది లానె్సట్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో జరిగే మార్పులపై, దాని ప్రభావంపై కూడా శాస్తవ్రేత్తలు దృష్టి పెట్టాలని ది లానె్సట్ జర్నల్ పేర్కొంది. కాలుష్యం వల్ల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు భవిష్యత్తులో మానవ ఆరోగ్యంపై భయంకరమైన ప్రభావాన్ని చూపక తప్పదని ఆ జర్నల్ హెచ్చరించింది.
వాయు కాలుష్యంతో భారత్‌లో లక్షలాది మంది ప్రజలు అనారోగ్యానికి గురవడంతో జాతీయాదాయంలో 38 బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ఎంతోమంది అకాల మరణానికి గురవుతున్నారనీ ప్రపంచ బ్యాంక్ నివేదికలో పేర్కొన్నారు. ఇటీవల 48 మంది ప్రముఖ శాస్తవ్రేత్తలు సంయుక్తంగా విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక ప్రకారం ఢిల్లీ, పాట్నా నగరాలు ప్రపంచంలోనే అత్యధికంగా కలుషితమైన నగరాలుగా గుర్తించబడ్డాయనీ, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే పి.ఎం. 2.5 ఈ నగరాలలోని గాలిలో అధిక మొత్తంలో నిండిపోయిందనీ పేర్కొంది. వాయు కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 18 వేల మందివరకు మరణిస్తున్నారు. దీనినిబట్టి పర్యావరణ కాలుష్యమే ప్రపంచ మానవాళికి అతి పెద్ద ప్రమాదకారి అని నిర్థారితమవుతోంది. పర్యావరణ కాలుష్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా 225 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంక్ తెలుపుతోంది.
కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ శాఖ మంత్రి గతంలో పార్లమెంటులో మాట్లాడుతూ వాయుకాలుష్యాన్ని పర్యవేక్షించడానికి ఏటా 7 కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. ‘పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం పసిపిల్లల ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. దీని గురించి ఇప్పుడు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఇది సరిపోదు. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది’’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ హర్షకుమార్ అంటున్నారు. ఆయన మంచి అనుభవజ్ఞుడైన వైద్యుడు కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఇప్పుడున్న వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగినట్లయితే క్రీ.శ.2030లో అధిక ఉష్ణోగ్రతల వల్ల 38వేల మంది, విరేచనాల వల్ల 48వేలమంది, మలేరియా వల్ల 60వేలమంది, పౌష్టికాహార లోపం వల్ల 95వేల మంది పిల్లలు అదనంగా మరణించడం సంభవిస్తుంది. 2050 వచ్చేనాటికి అధిక ఉష్ణోగ్రతల వల్ల లక్షకుపైగానే మరణాలలు సంభవిస్తాయనీ, 2030 తరువాత నుండి దక్షిణ ఆసియాలోనే పిల్లల ఆరోగ్యంపై వాతావరణంలోని మార్పులు అధిక ప్రభావాన్ని చూపుతాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. వాయుకాలుష్యం వల్ల 2013లో ప్రపంచ వ్యాప్తంగా 5.5 మిలియన్ల ప్రజలు వివిధ రోగాలతో మరణించారనీ, ఇందువల్ల కొన్ని దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయనీ ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

డాక్టర్ దుగ్గిరాల రాజకిశోర్ సెల్: 80082 64690