కర్నూల్

శ్రీశైలంలో ఫిబ్రవరి 29 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలంలో ఫిబ్రవరి 29 నుంచి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
* భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదు:కలెక్టర్
శ్రీశైలం, జనవరి 23: శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజయమోహన్ అన్నా రు. శనివారం శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 10వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అసౌకర్యం కలుగకుండ ఉండేందుకు, శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కలెక్టర్ శ్రీశైలంలో జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఏర్పాట్లను దేవస్థానం ఇఓ కెవి. సాగర్‌బాబు కలెక్టర్‌కు, జిల్లా యంత్రాంగం, అధికారులకు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2016 మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గత సంవత్సర అనుభవాలు, లోటు పాట్లను సమీక్షించుకొని తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. కాలి నడకన వచ్చే భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయం అందించాలని వైద్య, దేవాదాయ శాఖాధికారులకు సూచించారు. కాలినడకన వచ్చే భక్తులకు అడవిలో క్లియరెన్స్ ఇవ్వాలని ఫారెస్టు అధికారులను కోరారు. భక్తుల రాకపోలకు ఇబ్బందులు లేకుండ ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు పక్కా ప్రాణాళికతో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిపిఓను ఆదేశించారు. తాగునీటి సమస్య రాకుండ అన్ని ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు తెలిపారు. రాత్రి వేళల్లో వచ్చే భక్తులకు విద్యుత్ కాంతులు ఎక్కువగా ఉండే లా లైట్లు ఏర్పాటు చేయాలని, ఆలయ ముందు భాగంలో, ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆలయానికి మహిళలు, పురుషులు వస్తుంటారని, హోం గార్డులు, మహి ళా కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైర్‌లెస్ సెట్లు ఇవ్వాలని తద్వారా సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. మూడు జిల్లాల నుంచి శ్రీశైలం వచ్చే రహదారులను శ్రీశైలానికి అనుసంధానంగా ఉన్న రహదారులను మరమ్మతులు చేసి వాహనాలకు, భక్తులకు ఇబ్బందులు లేకుండ చూడాలని ఆర్‌అండ్‌బి అధికారులకు, ఆలయ ఇఇలకు సూచించారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, గత సంవత్సరం మాదిరిగానే రక్తం అందుబాటులో ఉండేలా, కాలినడకన శ్రీశైలం వచ్చే భక్తులకు సేదతీరేలా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. అన్ని ప్రాంతాల నుంచి బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పాతాళ గంగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ ఉండేందుక గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ అధికారులకు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు వసతికి సంబంధించిన అన్ని విషయాలు ఆర్డీఓ చూసుకోవాలన్నారు. తదుపరి సమావేశం నాటికి ఏర్పాట్లు పూర్తి కావాలని మళ్లీ ఏవైన పనులు నిలిచి ఉంటే త్వరగా పూర్తి చేయాలన్నారు. వచ్చే కృష్ణ పుష్కరాలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండ నిర్వహించేందుకు శివరాత్రి బ్రహ్మోత్సవాలను అనుభవంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వచ్చే అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆదినారాయణరెడ్డి, ఎఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జెఇఓ హరినాథ్‌రెడ్డి, డిఎస్పీ సుప్రజ, ఆర్డీఓ రఘుబాబు, ఆత్మకూరు రేంజ్ డిఎఫ్‌ఓ సెల్వం, జిల్లా ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాతివనాల్లో టూరిజం రిసార్టు
* 10 ఎకరాలు కేటాయింపు.. * త్వరలో పనులు ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జనవరి 23:కర్నూలు నగర వాసులు ఇక ముందు వారాంతపు సెలవులు గడిపేందుకే ఓర్వకల్లు వద్ద ఉన్న రాతి వనాల్లో టూరిజం రిసార్టు ఏర్పాటు చేయడానికి ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాతి వనాల్లో 10 ఎకరాల భూమిని కేటాయించడానికి సిద్ధపడినట్లు సమాచారం. సుమారు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించే రిసార్టులో సామాన్యులు, శ్రీమంతులు సేద తీరడానికి అవసరమైన గదులు, హోటళ్లు, స్విమ్మింగ్ ఫూల్, పలు క్రీడా ప్రాంగణాలు, ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే రిసార్టులో ప్రజల ఆనందానికి అవసరమైన వసతులన్నీ సమకూర్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో ఔత్సాహికుల నుంచి టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఓర్వకల్లు పరిసరాల్లో నిర్మించే పారిశ్రామిక వాడకు నీటిని అందించేందుకు నిర్మించతలపెట్టిన జలాశయం సమీపంలోనే రిసా ర్టు నిర్మాణం చేపట్టే అవకాశముందని, ఇందుకు అనువైన స్థలాన్ని పరిశీలించనున్నట్లు వారు తెలిపారు. స్థలాన్ని గుర్తించిన వెంటనే మొక్కలు నాటే పనులు ప్రారంభిస్తామని పేర్కొంటున్నారు. రాతి వనాల్లో ఇప్పటికే ప్రజల కోసం సుమారు 25 అతిథి గృహాలు నిర్మించారు. అయితే వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజాదరణ పొందలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించేందుకు వీలుగా టూరిజం ప్యాకేజీల రూపకల్పనలో పర్యాటక శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ పర్యటన కూడా కొత్తగా నిర్మించే ప్రాంతం నుంచే ప్రారంభించేలా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కూడా ఆలోచన చేస్తున్నారు. రాతి వనాల్లో టూరిజం టూరిజం రిసార్టు నిర్మాణ అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జీతాలు పెంచారు.. అమలు మరిచారు!
* ప్రభుత్వ తీరుపై స్థానిక నేతల అసంతృప్తి..
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జనవరి 23:రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రతినిధుల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా అమలులోకి రాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. స్థానిక సంస్థలకు 20 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన స్థానిక సంస్థల ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సిఎం చంద్రబాబు 4 నెలల క్రితం జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆనందించిన వారు కొత్త జీతాలు చేతికి వస్తాయని ప్రతి నెలా ఎదురు చూస్తున్నారు. పెంచిన జీతాలు ఇంకా అమలులోకి రాలేదంటూ అధికారులు పాత జీతాలనే చేతుల్లో పెట్టి పంపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,899 మంది సర్పంచ్‌లు, 9,923 మంది ఎంపిటిసిలు, 647 మంది జడ్‌పిటిసిలు, 2,571 మంది పురపాలక సంఘాల కౌన్సిలర్లు, సుమారు 550 మంది నగర పాలక సంస్థల్లోని కార్పొరేటర్ల జీతాలు పెంచుతూ గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రకటన జారీ చేసింది. స్థానిక సంస్థల ప్రతినిధులకు కనిష్టంగా రూ. 2 వేల నుంచి రూ. 6 వేల వరకు ప్రతి నెలా జీతం అందుతుందని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా కొత్త జీతాల సంగతి ఎటూ తేలకపోవడంపై స్థానిక ప్రతినిధులు లోలోనే రగిలిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన వారు మర్యాద పోతుందని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు ప్రజల్లో చులకనవుతామని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సైతం జీతాలు పెంచుతూ ప్రకటన చేసినా అమలు కాకపోవడంతో వారు ఏకంగా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు విజయవాడ వెళ్లి ఆందోళన చేపట్టారు. దాంతో ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీలకు పెంచిన జీతాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసింది. ఇక స్థానిక నేతల తరపున పోరాడే వారు లేకపోవడంతో శాసనసభలోనైనా జీతాల అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ప్రభుత్వం పెంచిన జీతాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నంద్యాల కేంద్రంగా శ్రీగంధం చెక్కల అక్రమ రవాణా!
* రూ. 3 లక్షల విలువైన చెక్కలు స్వాధీనం..
* నిందితుడిని వదిలేసిన అటవీ శాఖ సిబ్బంది..
నంద్యాల, జనవరి 23: నల్లమల అడవుల్లో ఇటీవల కాలంలో బయటపడిన శ్రీగంధం చెట్లను ఎర్రదొంగలు తరలించడానికి నంద్యాల కేంద్రంగా అక్రమ రవాణా ప్రారంభించారు. శ్రీగంధం చెట్లు 25 సంవత్సరాల వయ స్సు వచ్చిన అనంతరమే వాటిలో సుగంధ పరిమలాలు వెదజల్లుతాయని, అంతవరకు ఆ చెట్లను నరికినా అవి పనికి రావని అటవీ అధికారులు అంటున్నారు. శుక్రవారం రాత్రి అటవీ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గాజులపల్లె వద్ద కాపు కాసిన అటవీ అధికారులు గిద్దలూరు నుండి హైదరాబాదుకు బయలుదేరిన మేఘన ట్రావెల్స్ ప్రైవేటు బస్సును దారి కాచి సోదా చేశారు. దీంతో ఆ బస్సులో రెండు సూట్‌కేసు ల్లో అక్రమ రవాణా చేస్తున్న 50 కిలోల బరువు కలిగిన గంధపు చెక్కలను స్వాధీనం చేసుకొని నిందితున్ని అదుపులోకి తీసుకొని ప్రైవేటు ట్రావెల్ బస్సును నంద్యాల డిఎఫ్‌ఓ కార్యాలయానికి శుక్రవారం రాత్రి తరలించి నిందితులను, బస్సు డ్రైవరును విచారిస్తుండగా ఒక నిందితుడు అటవీ అధికారుల కన్నుగప్పి తప్పించుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అటవీ శాఖ ఉన్నతాధికారులు బయట పడకుండ గోప్యంగా ఉంచారు. శ్రీగంధపు చెక్కలను అక్రమ రవాణా చేస్తున్న పెద్ద కంబలూరు నివాసి, చికెన్ సెంటరు నిర్వాహకుడేనని అటవీ సిబ్బందికి స్పష్టంగా తెలిసినప్పటికి ఉద్దేశ పూర్వకంగానే నిందితున్ని వదిలి వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గిద్దలూరు నుండి హైదరాబాదుకు వెళ్తున్న బస్సులో గాజులపల్లెకు సమీపంలో నిందితుడు రెండు సూట్‌కేసులతో దర్జాగా హైదరాబాద్ వెళ్తున్నట్లు బస్సు ఎక్కాడని బస్సు డ్రైవర్ వాపోయాడు. బస్సులో ఉన్న సిబ్బందికి అక్రమ రవాణాకు ఎలాంటి సంబంధం లేకపోయినా బస్సును అటవీ అధికారులు సీజ్ చేయడంతో అందులో ఉన్న ప్రయాణికులను హైదరాబాదుకు పంపడం చాలా కష్టంగా మారిందని వాపోయారు. తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా నిందితున్ని ఉద్దేశ పూర్వకంగా వదిలేసిన అటవీ సిబ్బంది బస్సు డ్రైవరును, సిబ్బందిని వేధించడం ఎంతవరకు సమంజసమని వాపోయారు.
ఆగని డీలర్ల అక్రమ దందా!
* పోలీసులకు చిక్కిన చౌకబియ్యం, చంద్రన్న కానుకలు
* పట్టించుకోని అధికారులు
ఆదోని, జనవరి 23: చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకులు నల్లబజారుకు తరలించే అక్రమ దందా ఆగడం లేదు. శనివారం పట్టణంలో నల్లబజారుకు తరలుతున్న నిత్యావసర వస్తువుల ఏడున్నర క్వింటాళ్ల బియ్యం, కిరోసిన్‌తో సరుకులతోపాటు చంద్రన్న కానుకులైన నెయ్యి 74, బెల్లం, కందిపప్పు 38, శెనగ పప్పు 29 ప్యాకెట్లను పోలీసులు పట్టుకొని తహశీల్దార్ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. వీటిని కొనుగోలు చేసిన నల్లబజారు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పోలీసులు రెండు రోజుల క్రితం నాలుగు క్వింటాళ్ళ సబ్సిడీ బియ్యం పట్టుకుని రెవెన్యూ శాఖ అధికారులకు అందజేశారు. ఇంకా ఈ సంఘటన మరువక ముందే మళ్లీ శనివారం బియ్యంతోపాటు చంద్రన్న కానుకలు పోలీసులకు పట్టుబట్టడం చూస్తుంటే ఆదోని పట్టణంలో ఉన్న చౌక దుకాణాల డీలర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. అందువల్లనే డీలర్ల అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది అనడానికి పోలీసులు పట్టుకున్న చౌక దుకాణాల సరుకులే సాక్ష్యం. రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని ఉన్నారు. అంతేకాకుండా డీలర్లతో రెవెన్యూ అధికారులకు లోపాయికారి ఒప్పందం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. నెల మామూళ్ళు పెద్ద ఎత్తున డీలర్లు అందజేస్తున్నట్లు సమాచారం. ఇందుకు నేతల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చౌక దుకాణాల ద్వారా ప్రజలకు సక్రమంగా నిత్యావసర సరుకులు సరఫరా అవుతున్న విషయాన్ని పర్యవేక్షించాల్సిన ముఖ్య అధికారికి పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నట్ల సమాచారం. ముడుపుల కింద లక్షల రూపాయలు అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అందువల్లనే డీలర్లు భయంలేకుండా నల్ల బజారుకు నిత్యావసర సరుకులను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఖతీబ్‌పుర ప్రాంతానికి చెందిన ప్రజలు ఉరుకుందమ్మ, షాబుద్దీన్, వెంకటలక్ష్మీ, మల్లేశ్వరి, శకుంతల, ఈరన్న, రంగన్న, ఉషాలు తమకు చంద్రన్న కానుకలు పంపిణీ చేయలేదని, చౌక దుకాణం వద్దకు వెళ్తే బియ్యం వేసినట్లు ఇమిషన్‌లో ఉందని, ఇదంతా డీలర్ చేతివాటమని వారు పేర్కొంటూ తమకు న్యాయం చేయాలని వైకాపా నాయకులు, మున్సిపాల్ కో ఆప్షన్ సభ్యులు చంద్రకాంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లిన విషయం పాఠకులకు విధితమే. ఈవిధంగా డీలర్లు ఇ పాస్ సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకొని ఒకేసారి అన్ని సరుకులు వేసినట్లు వేలిముద్ర వేయించుకొని ప్రజలు మోసం చేస్తున్నట్లు ఖతీబ్‌పుర్ సంఘటన డీలర్ల అక్రమాలకు ఎదురు లేని సాక్ష్యంగా నిలుస్తోంది. రెవెన్యూ అధికారులు చేయాల్సిన పనిని పోలీసులు చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే పోలీసులు డీలర్ల అక్రమాలపై కొరడా ఝూలిపించి రెండు చోట్లు అక్రమ బియ్యం, నిత్యావసర సరుకులను పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రెవెన్యూ అధికారుల చలువతోనే డీలర్ల అక్రమ దందా కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. కొనుగోళు చేసి శనివారం నిత్యావసరాలను తరలిస్తున్న వ్యాపారి ఇబ్రహింతో పాటు మరో వ్యాపారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ డీలర్ల ఆగడాలకు కళ్లం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని నిత్యావసర వస్తువులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఎంతైన ఉంది.
డీలర్లపై పర్యవేక్షణ లేదు:తహశీల్దార్ శ్రీనివాసరావు
నిత్యావసర వస్తువుల సరకులను సక్రమంగా డీలర్లు పంపిణీ చేస్తున్నోరో లేదో అనే విషయాన్ని పరిశీలించే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేదని, సరుకుల పంపిణీ విషయంలో పత్రికల్లో వస్తున్న విమర్శలు మాములేనని తహశీల్దార్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఆయను కలిసి నిత్యావసర సరుకులు ప్రజలకు డీలర్లు సక్రమంగా పంపిణీ చేయక నల్లబజారుకు తరలిస్తున్నారని విషయాన్ని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉందని, సిఎస్‌డిటి సక్రమంగా ఉండలేదని అందువల్ల సరుకుల పంపిణీని పరిశీలించే పర్యవేక్షణ కొరవడిందని అంగీకరించారు. ఎవరైన ప్రజలు డీలర్లపై ఫిర్యాదులు చేస్తే తాను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్టస్థ్రాయి తైక్వాండో
పోటీలు ప్రారంభం
నంద్యాల, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జిల్లా తైక్వాండో సంఘం నిర్వహణలో రాష్టస్థ్రాయి తైక్వాండో పోటీలను నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శనివారం డిఎస్పీ హరినాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఆంధ్రరాష్ట్ర ప్రథమ ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలను జిల్లా తైక్వాండో సంఘం అద్యక్షులు, జిల్లా ఒలింపిక్ సంఘం గౌరవ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్‌క్లబ్, రితి జ్యువెలర్స్ సౌజన్యంతో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి 300 మంది క్రీడాకారులు, జట్టు మేనేజర్లు, కోచ్‌లు, రెఫరీలు, నిర్వాహకులు వంద మంది వరకు పాల్గొన్నారు. ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్‌లో తైక్వాండోకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఒలింపిక్ గేమ్స్‌లో గుర్తింపు ఉన్న క్రీడ అన్నారు. ఈ క్రీడలు యువతరంలో ఆత్మ విశ్వాసం పెంచుతూ మానసిక ధైర్యం కలిగిస్తాయన్నారు. క్రమశిక్షణ, విజయం సాధించాలన్న తపన, క్రీడల వల్ల కలుగుతాయన్నారు. రాష్టస్థ్రాయి పోటీలు నంద్యాలలో నిర్వహించడం గర్వకారణమన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం గౌరవ చైర్మన్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు సీనియర్, జూనియర్ విభాగాల్లో వివిధ వెయిట్ కేటగిరిల్లో పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్టస్థ్రాయి పోటీల్లో విజేతలకు పతకాలు, చాంపియన్‌షిప్ ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేస్తారన్నారు. ఈకార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ హేమంత్‌రెడ్డి, రైల్వే డివిజనల్ ఇంజనీరు వీరమణి, ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరెడ్డి, ఎపి తైక్వాండో సంఘం కార్యదర్శి శ్రీనివాస్, తైక్వాండో మాస్టర్ నాగూర్‌బాబు, జిల్లా సంఘం కార్యదర్శి ఎల్ టి చంద్రవౌలి, కోశాధికారి ఫర్హతుల్లా, ఉపాద్యక్షులు సర్దార్ అలిఖాన్, మాస్టర్ సుందర్‌రాజు, లయన్స్‌క్లబ్ సేవా ప్రగతి అధ్యక్షులు వేణుమాధవరెడ్డి, లయన్స్‌క్లబ్ కార్యదర్శి రామన్న, రితి జ్యువెలర్స్ ప్రతినిధి రమేష్, కళాశాల కార్యదర్శి రవి ప్రకాస్, సంయుక్త కార్యదర్శి పెసల శ్రీకాంత్, తైక్వాండో రాష్టస్రంఘం ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు. క్రీడాకారులకు, అధికారులకు ఎంపి ఎస్పీవైరెడ్డి ఉచిత భోజన వసతి కల్పించారు. జ్ఞాపికలు, పతకాలు, ట్రోఫీలను రితి జ్యువెలర్స్ వారు అందజేసినట్లు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. వసతి సౌకర్యాన్ని రైల్వే ఇన్సిట్యూట్ వారు ఉచితంగా కల్పించినట్లు తెలిపారు.
అద్దె గర్భం వ్యవస్థను నిర్మూలించాలి
* ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు..
* ఖచ్చితమైన సమాచారంతోనే గల్ఫ్ దేశాలకెళ్లండి..
* మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం
కర్నూలు, జనవరి 23:అద్దె గర్భం వ్యవస్థ నిర్మూలనకు చట్టపరమైన ఆంక్షలు రావాల్సి ఉందని రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. నిరుపేద మహిళలు అధిక జీతాలకు ఆశపడి పనులు చేసేందుకు కువైట్, దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురవుతన్నారన్నారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుపేద మహిళలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగాలేని కారణంగా అధిక మొత్తాలకు ఆశ పడి ఇతర దేశాల్లో పనులు చేసేందుకు వలస వెళ్లి అక్కడ అనేక రకాల ఇబ్బందులకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోకుండా ఖచ్చితమైన పూర్తి సమాచారం వుంటేనే వెళ్లాలని సూచించారు. ఇతర దేశాలకు వెళ్లేందుకు ఏజెంట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పంపుతున్నారని, దీంతో అక్కడికి వెళ్లిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విదేశాలకు వెళ్లిన మహిళలు బందీలుగా పని చేయడమేకాకుండా లైంగికంగా, శారీరకంగా ఇబ్బందులు పడటం దారుణమైన విషయమన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించడానికి అనేక చట్టాలు ప్రవేశ పెట్టినప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. కొందరు ఏజెంట్లు డబ్బు అవసరమైన నిరుపేద మహిళలను గుర్తించి ప్రలోభ పెడుతున్నారని ఇలాంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి
* ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి
ఆదోనిటౌన్, జనవరి 23: ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేందుకు బాధ్యతగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉందని ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రఘురామిరెడ్డి అన్నా రు. శనివారం జ్యోతిర్మాయ కళాశాల మైదానంలో జిల్లా విద్య, వైజ్ఞానిక మహాసభలు ఎపిటిఎఫ్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘురామయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభల కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలోని విద్యను ఒకే గొడుగుకిందకి తేవాలని గత ఏడు దశాబ్దాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం రోజుకు ఒక పేరుతో కొత్త విద్యా విధానాన్ని తెరపైకి తెస్తోందన్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఒకరికి ఒక రకమైన విద్యను అందించడానికి ప్రభుత్వం పాఠశాలల హేతుబద్దీకరణ పేరుతో మూసి వేయడం జరుగుతోందన్నారు. విద్యాహక్కు చట్టం ఎక్కడ అమలు కావలేదన్నారు. ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పాఠశాలలను మూసి వేశారని వైద్య రంగం మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. అందువల్ల ఉపాధ్యాయులు మేలుకొని తమవంతుగా బాధ్యతగా పని చేస్తేనే ప్రభుత్వ విద్యను కాపాడుకోగలమని, లేని పక్షంలో భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఉండవన్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో 17 వేల పాఠశాలలు మూ సివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాలు ఎన్ని ఉన్నా పాఠశాలలను రక్షించుకోవలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అప్పుడే సమాజానికి న్యాయం చేసిన వారమవుతామని పిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఈనెల 28న కలెక్టరేట్ల ముట్టడి ఉందని తెలిపారు. ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డుల ద్వారా ఉచిత విద్య అందించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని, దీనిని రద్దు చేయాలని రాష్ట్ర నాయకులు ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు షేక్ జిలానీ పిలుపు నిచ్చారు. విద్యారంగం పరిరక్షణకు ప్రతి ఉపాధ్యాయ సంఘం కృషి చేయాలని, ఎపిటిఎఫ్ తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని ఉప విద్యాధికారి శివరాముడు అన్నా రు. ఈసదస్సులో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండి. శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, భూమా చెంచిరెడ్డి, గోవిందరెడ్డి, జంబన్నతోపాటు అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గనుల్లో నిబంధనల మేరకే
తవ్వకాలు చేపట్టాలి
* మైన్స్ డైరెక్టర్ మనీష్ ముర్కుతే
డోన్, జనవరి 23:డోన్ ప్రాంతం ఖనిజ సంపదకు పుట్టినిల్లు అని, ఈ సంపదను కాపాడేందుకు ప్రతి ఒక్క రూ పాటు పడాలని, ప్రభుత్వ నిబంధనల మేరకే తవ్వకాలు చేపట్టాలని మైన్స్ డైరెక్టర్ మనీష్ ముర్కుతే స్పష్టం చేశారు. పట్టణ సమీపంలోని ఎస్‌డబ్ల్యుఎంఎల్ కార్యాలయం ఆవరణలో శనివారం పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ముర్కుతేతో పాటు జిందాల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నందన్ బండారే హాజరయ్యారు. ఈ సందర్భంగా ముర్కుతే మాట్లాడుతూ ఖనిజ సంపదను వెలికితీసే కార్మికులకు రక్షణ కల్పించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదన్నారు. అంతేగాక మైనింగ్ పరిసర ప్రాంతాలను పచ్చదనంతో నింపాలని తెలిపారు. అనంతరం పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్న వెల్దుర్తికి చెందిన మైనింగ్‌కు ఉత్తమ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో కర్నూ లు మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ పుల్లయ్య, సేఫ్టీ డిడి నాగేశ్వరరావు, తిరుపతి, ఎస్‌డబ్ల్యుఎంఎల్ మేనేజర్ కేశవరెడ్డి, బేతంచెర్ల, డోన్ మైన్స్ అధ్యక్షుడు సుజాతశర్మ, శ్రీరాములు, పారిశ్రామికవేత్తలు డి.కృష్ణారెడ్డి, ఎన్‌ఎల్ మధు, రామ్మోహనరెడ్డి, పెద్ద నాగిరెడ్డి, శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైద్యమిత్రల భిక్షాటన
కర్నూలు సిటీ, జనవరి 23:ఎన్‌టిఆర్ వైద్య పథకంలో పనిచేస్తున్న వైద్య మిత్రలను తొలగించకుండా యధావిధగా కొనసాగించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. భిక్షాటన చేస్తున్న వైద్య మిత్రలకు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎన్‌టిఆర్ వైద్య పథకంలో పనిచేస్తున్న వారిని తొలగించాలని చూడటం దారుణమన్నారు. వైద్య మిత్రలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపిన తర్వాత తొలగించాలని లేకపోతే వారినే యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశా రు. భిక్షాటనలో వైద్యమిత్ర సంఘం నాయకులు రాజశేఖర్, జిలానీ, లక్ష్మిప్రసన్న, నరసింహులు, కేశన్న, నాగరాజ్, సుమతి, సాజాత, సునిత పాల్గొన్నారు.
బాలలు, మహిళల చట్టాలను
పకడ్బందీగా అమలు చేయాలి
* ఎంపి బుట్టా రేణుక
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 23: బాలలు, మహిళల చట్టాలను ప్రభు త్వం పకడ్బందీగా అమలు చేయాలని కర్నూలు ఎంపి బుట్టా రేణుక కోరా రు. నగరంలోని సూరజ్ గ్రాండ్ హో టల్‌లో శనివారం సొసైటీ ఫర్ సొషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో బాలలు, మహిళల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపి బుట్టా రేణుకా, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, జిల్లా న్యాయసేవా సదన్ కార్యదర్శి, సీనియర్ జడ్జి సోమశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భం గా ఎంపి రేణుక మాట్లాడుతూ మహిళలు, బాలల హక్కులపై పార్లమెంటు లో చర్చించేలా కృషి చేస్తామన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశం కల్పించాలని, కానీ అడుగడుగునా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా చట్టాలపై గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా న్యాయసేవా సదన్ కార్యదర్శి, జడ్జి సోమశేఖర్ మాట్లాడుతూ మానవ హక్కులకు భంగం కలుగకుండా చూ సుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గృహ హింసకు గురైన మహిళలకు భర్త ఆర్థిక పరిస్థితిని బట్టి భరణం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మహిళలకు రక్షణ కరువైందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. లైగింక వేధింపులు తగ్గాలంటే మహి ళా హక్కులపై ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది చెన్నయ్య, మోహన్‌రాజు, అధ్యాపకురాలు శ్రీదే వి, మద్దిలేటి, రామకృష్ణ పాల్గొన్నారు.