జాతీయ వార్తలు

ఎస్పీ సల్వీందర్‌కు ఎన్‌ఐఏ క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: పఠాన్‌కోట్ దాడికి సంబంధించి జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఐఏ) గత కొన్ని రోజులుగా ప్రవ్నిస్తున్న పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి సల్వీందర్ సింగ్‌కు ఆ సంస్థ క్లీన్‌చిట్ ఇచ్చింది. లైడిటెక్టర్ పరీక్ష, ఇతర పరీక్షల్లో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించక పోవడంతో ఎన్‌ఐఏ ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ఎస్‌పి ర్యాంక్ అధికారి అయిన సల్వీందర్ సింగ్‌ను గత 15 రోజులుగా ఎన్‌ఐఏ తన ప్రధాన కార్యాలయంలో గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ ఉంది. అంతేకాకుండా లై డిటెక్టర్ పరీక్ష సహా అనేక సైంటిఫిక్ పరీక్షలు కూడా ఆయనపై జరిపారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు గత నెల 31వ తేదీ అర్ధరాత్రి సల్వీందర్ సింగ్‌ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్ తర్వాత జరిగిన సంఘటనలను నిర్ధారించడం కోసం ఎన్‌ఐఏ ఆయనను ప్రశ్నించింది. పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లో కొనసాగుతున్న డ్రగ్ రాకెట్‌తో సింగ్‌కు ఏమయినా సంబంధాలున్నాయేమోనన్న అనుమానంతో ఎన్‌ఐఏ ఆయనను లోతుగా ప్రశ్నించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల ముఠా తనను కిడ్నాప్ చేసినట్లు సల్వీందర్ సింగ్ చెప్పడం తెలిసిందే. సింగ్‌ను ఆయన వంటమనిషిని వదిలిపెట్టిన ఉగ్రవాదులు వారితో పాటు ఉన్న సింగ్ స్నేహితుడు, వజ్రాల వ్యాపారి రాజేశ్ వర్మ గొంతు కోసి రోడ్డుపై పడేసి అదే వాహనంలో పరారయ్యారని ఆ వర్గాలు తెలిపాయి.