డైలీ సీరియల్

వ్యూహం 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ షెల్ఫ్‌లో వున్నవన్ని జిరాక్స్ కాపీలని, వాటి ఒరిజనల్స్ స్కంద దగ్గర ఉన్నాయని వీడికి తెలియదు.. వీడే వేస్ట్‌ఫెలో! వాడి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయ్యింది! అనుకున్నాడు. తనలో తానే నవ్వుకున్నాడు కాశి.
‘‘ఎందుకు నవ్వు మొహం పెట్టావ్? ఏం ఘనకార్యం సాధించావని.. వెళ్లి డాక్టర్ లోహితను పిల్చుకునిరా! ఆ అమ్మాయిని వొళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యమని చెప్పాలి! ఆ ఆరిఫ్ మెంటల్ ఫెలో! వాడికి కోపం వస్తే పిట్టను కాల్చినట్టు కాల్చిపారేస్తాడు.. చిన్న ఈక కూడా మిగలనివ్వడదు’’ అన్నాడు అరవింద్.
ఛాంబర్‌నుండి బయటకు వచ్చేశాడు!
ఏదో మాస్టర్ ప్లాన్ కాశి మెదడు పొరల్లో మెదులుతూ ఉంది. ఆ ప్లాన్ సక్సెస్‌ఫుల్ అయితే తనంత అదృష్టవంతుడు ఉండడు ప్రపంచంలో. డాక్టర్ అరవింద్ పెద్ద గుణపాఠం నేర్పాలి!
తన పేరు గుర్తుకు వస్తేనే అతనికి చెమటలు పట్టాలి!
జీవితకాలం అతను చింతిస్తూ బ్రతకాలి!
డాక్టర్ లోహిత తనకు సహకరిస్తుంది.
జీవితాంతం తనకు తోడుగా వుంటుంది తన ప్లాన్ ఆమెకు వివరంగా చెబితే! ఎంతో సంతోషపడుతుంది.. ‘జీనియస్’ అని తనను మెచ్చుకుంటుంది!
తనలో తాను నవ్వుకున్నాడు కాశి.
***
డాక్టర్ లోహితతోపాటు డాక్టర్ అరవింద్ ఛాంబర్‌లోకి వచ్చేడు కాశి.
‘‘నువ్వెందుకు లోపల? బయటకు వెళ్ళు! మేం మాట్లాడుకునే మెడికల్ విషయాలు నీకేం అర్థం అవుతాయి.. యుకెన్ గో నౌ’’ అన్నాడు అరవింద్ కాశితో.
ఒళ్ళు మండిపోయింది కాశికి. ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్లతో, హాస్పిటల్స్‌తో అనుబంధం ఏర్పరచుకుని తిరుగుతూ వున్నాడు. ఆ మాత్రం తెలియదా? ప్రెగ్నెన్సీ, చైల్డ్‌బర్త్‌కు సంబందించి బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ‘అబ్‌స్టెట్రిక్స్’. ఆడపిల్లలు, స్ర్తిలకు జననాంగాల దగ్గర వచ్చే వ్యాధులు, ఫిజియోలాజకల్ ఫంక్షన్స్ తెలిపే బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ‘గైనకాలజీ..’ ఆ మాత్రం తెలియదా తనకు?
అవసరాలకు తనను వాడుకుంటాడు, ఆ తరువాత పురుగును తీసేసినట్లు నలుగురి ముందు విదిల్చినట్లు మాట్లాడుతాడు.. ఉత్త శాడిస్టు!
కాశి మనసులోనే అరవింద్‌ను తిట్టుకుంటూ బయటకు వెళ్ళాడు.
డాక్టర్ అరవింద్ దృష్టి లోహిత మీద పడింది. ‘‘నీకు ఎన్నోసార్లు చెప్పాను. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండమని.. నీ పరిధి దాటి నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావ్.. పోలీసు ఆఫీసర్‌తో పరిచయం పెంచుకుంటున్నావ్.. మేం వద్దని చెప్పినా! డాక్టర్లకు పోలీసు అధికార్లతో సాన్నిహిత్యం అవసరమా? నీవే ఆలోచించుకో!
మన హాస్పిటల్‌కు ఎంతోమంది స్ర్తిలు, ఆడపిల్లలు వస్తూ వుంటారు.. గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో వాళ్ళకు వివరించి చెప్పాలి! నేను ఇంత పెద్ద హాస్పిటల్‌కు హెడ్‌ను అయ్యానంటే ఊరికే ఎవరి రికమెంటేషన్‌తో కాలేదు.. నా స్వయంకృషితో అయ్యాను. కిడ్నీ ఆపరేషన్స్ అవలలీగా చేసేస్తాను... సర్జరీ అంటే ఇష్టంనాకు.. కానీ అన్ని బ్రాంచీలలో నాలెడ్జి గేదర్ చెయ్యడానికి ఇష్టపడతాను.. చాలామంది ఆడవాళ్ళు ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు.. ఆపరేషన్స్ అయ్యేక చాలా కేసుల్లో గైనిక్ కంప్లైంట్స్ వస్తున్నాయి.. కొన్ని మెడికల్ కాన్ఫరెన్స్‌లో ఆ విషయం గూర్చి మాట్లాడేను.. ట్యూబ్‌లిగేషన్ ఆపరేషన్స్ తరువాత పెల్విక్ పెయిన్, వైట్ డిశ్చార్జి మెన్‌స్ట్రల్ ఇరెగ్యులారిటీ వస్తున్నాయి కొన్ని కేసుల్లో... ‘‘యాన్ ఇనసైట్ ఇన్ టు కాంప్లికేషన్స్ ఆఫ్ ట్యూబ్‌లిగేషన్ ఆపరేషన్స్ ఇన్ ఫిమేల్స్’’ అనే వ్యాసం నేను రాసింది ఇంటర్నేషనల్ మెడికల్ మ్యాగజైన్స్‌లో ప్రచురింపబడింది.
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నీకు ప్రొఫెషన్ పట్ల ఆరాధన ఉండాలి... బాగా లైమ్‌లైట్ లోకి వచ్చేంతవరకు మిగతా విషయాలు పట్టించుకోకూడదు.
అరిఫ్‌కు నీమీద కోపం వచ్చింది.
‘‘.... నిన్ను బెదిరించి కంట్ల్రో పెట్టుకోవడానికి నీ చెల్లెలు మీద అఘాయిత్యం చెయ్యడానికి మనిషిని పంపించాడు, మీ నాన్న చెయ్యి నరికివేశారు. వాళ్ళు ఏదైనా చేస్తారు.. మేం చెప్పినట్లు వింటూ పదేళ్ళు కష్టపడ్డావంటే పది పైసల వాటా దక్కుతుంది! సముద్రంలో ఆనందంగా పయనిచే నౌకను నువ్వే నీళ్ళలో ముంచెయ్యకు! ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో! నీమీద నాకు సాఫ్ట్ కార్నర్ వుంది.. కన్నకూతురి లాంటిదానివి.. బిహేవ్ ప్రాపర్లీ అండ్ గెట్ రిచ్ డివిడెంట్స్!’’ అని చెప్పుకుపోయాడు డాక్టర్ అరవింద్.

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ