అంతర్జాతీయం

మరో డోక్లాం కానివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 9: గత కొన్నిరోజులుగా మాల్దీవుల సంక్షోభంపై వరుస ప్రకటనలు గుప్పిస్తున్న చైనా, తాజాగా భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మరో మెలిక పెట్టింది. మాల్దీవుల్లో సైనిక జోక్యం చేసుకోవాలని, అక్కడి పరిస్థితిని అదుపు చేయాలని భారత్‌పై డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో మాట్లాడిన చైనా ‘ఈ సమస్యను మరో డోక్లాంలా మార్చొద్దు’ అని భారత్‌కు స్పష్టం చేసింది. అయితే, మాల్దీవుల సమస్యను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై భారత్‌తో చర్చిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలే తప్ప భారత్, చైనాల మధ్య మరో డోక్లాం మాదిరిగా పెచ్చరిల్లకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఏక్షణంలోనైనా భారత్ ప్రత్యేక దళాలు మాల్దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందన్న కథనాల నేపథ్యంలో చైనా మరింత స్పష్టం గా తన వైఖరిని వ్యక్తం చేసింది. అన్య జోక్యం వల్ల మాల్దీవుల సమస్య మరింత ముదిరిపోతుందే తప్ప, పరిష్కారానికి అందదని తెలిపింది. ఇప్పటికే భారత్- చైనాల మధ్య అనేక కీలక సమస్యలు కొరకరాని కొయ్యలుగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో డోక్లాం వ్యవహారం దాదాపుగా సైనిక ఘర్షణల వరకూ వెళ్లింది. అలాగే పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించే విషయంలోనూ చైనా అడ్డుకోవడం కూడా వివాదంగా మారింది. ఈ పరిస్థితుల్లో మాల్దీవుల పేరుతో మరో సమస్య పుట్టుకురావడం ఎంతమాత్రం అభిలషణీయం కాదని చైనా అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మాల్దీవుల సమస్యపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎక్కడ భారత్ జోక్యానికి ఆస్కారం ఏర్పడుతుందోనన్న ఆందోళన చైనాలో మొదలైంది. ఒక్క భారతదేశమే కాదు, ఏ ఇతర దేశమూ కూడా మాల్దీవుల వ్యవహారంలో వేలు పెట్టకూడదని, అంతర్గత ప్రయత్నాల ద్వారానే ఆ సమస్య పరిష్కారానికి దోహ దం చేయాలని చైనా విదేశాంత మంత్రిత్వ శాఖ ప్రతినిధి షువాంగ్ స్పష్టం చేశారు.