రాష్ట్రీయం

సాగర తీరంలో గట్టి పహరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: విశాఖ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఆర్కే బీచ్ తీరంలో ఫిబ్రవరి 4 నుంచి నిర్వహించనున్న ఐఎఫ్‌ఆర్‌కు సుమారు 51 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులతోపాటు భారత రాష్టప్రతి, ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, తదితర ప్రముఖుల హాజరవుతున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు అత్యంత పకడ్బందీగా చేస్తున్నారు. సాగరతీరాన్ని భద్రతా సిబ్బంది అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. బీచ్ పరిసర ప్రాంతాలను వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ఇప్పటికే వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ భద్రతా సిబ్బంది ఇక్కడకు వచ్చి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని ప్రయాణించే ప్రధాన రహదారులతోపాటు పలుచోట్ల ప్రత్యేక రహదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్‌లో సైనికులు తుపాకులతో పహారా కాస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి 8 వరకు ఫ్లీట్ రివ్యూ జరుగుతుండగా, 7వ తేదీన బీచ్‌లో నిర్వహించే కార్యక్రమానికి మాత్రం మీ సేవ కేంద్రాల ద్వారా పాస్‌లు మంజూరు చేస్తున్నారు. ఆ రోజు ఫ్లీట్ రివ్యూను 1.40 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా మీ సేవ కేంద్రాల్లో ఉచితంగా పాస్‌లు అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. నగరంలోని 54 మీ సేవ కేంద్రాల్లో ఫ్లీట్ రివ్యూ పాస్‌లు జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు సమీక్ష జరిపారు. ఫ్లీట్ రివ్యూలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఫ్లీట్ రివ్యూ జరిగే ఆర్కే బీచ్‌కు ప్రజలు చేరుకునేందుకు వీలుగా అన్ని వైపుల ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు. కాగా 1.5 కిలోమీటర్ల మించి బీచ్ రోడ్డుకు నడవాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ నిర్వహణ చేయనున్నామని పోలీసు అధికారులు తెలిపారు.