అంతర్జాతీయం

కాషాయం జోలికెళ్తే కటీఫ్ రజనీతో పొత్తుపై కమల్ మెలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంబ్రిడ్జ్ (మసాచ్యూసెట్స్), ఫిబ్రవరి 11: త్వరలోనే తమిళనాడు రాజకీయ పార్టీ పెడతానని సంకేతాలు అందించిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్, మరో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పొత్తు విషయంలో తాజా మెలిక పెట్టారు. రజనీకాంత్ రంగు ‘కాషాయం’ అయితే, ఆయనతో పొత్తుకు తాను ఎంతమాత్రం సిద్ధంగా లేనని కమల్ స్పష్టం చేశారు. పరోక్షంగా బీజేపీతో రజనీకాంత్ సన్నిహితం అవుతున్నారన్న సంకేతాలను తన మాటల్లో ఆయన ధ్వనించారు. రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలను పాదుగొల్పటంతోపాటు, వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్టు కమల్ వెల్లడించారు. రజనీకాంత్‌తో ఇటు మ్యానిఫెస్టోలు, అటు ఆలోచనల్లో సారూప్యతవుంటే ఆయనతో కలిసి పని చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్న కమల్ ‘రజనీకాంత్ కాషాయ దిశగా అడుగులు వేయకుండా ఉంటేనే ఇది సాధ్యం’ అని తెలిపారు. ఇక్కడి హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగిన వార్షిక భారతీయ సదస్సులో కమల్ మాట్లాడారు. రజనీకాంత్‌తో పొత్తు విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా లేదని, అయితే ఇందుకు సంబంధించి తన ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అవసరమైతే రజనీతోనే కాకుండా ఇతర పార్టీలతోనూ చేతులు కలిపేందుకు సిద్ధమని పేర్కొన్న ఆయన, ఎన్నికల అనంతర పొత్తులకు తాను వ్యతిరేకమన్నారు. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోతే దానే్న ప్రజాతీర్పుగా భావించాలని పేర్కొన్న ఆయన ‘అదే పరిస్థితి నకు ఎదురైతే ప్రతిపక్షంలోనే కూర్చుని తదుపరి ఎన్నికల వరకూ ఎదురుచూస్తా’ అని తెలిపారు. అంటే తన పార్టీకి మెజారిటీ రాకపోతే ప్రజాతీర్పునే శిరసావహిస్తాను తప్ప అధికారం కోసం ఎలాంటి పొత్తులకు ఒడిగట్టే ప్రసక్తి లేదని వెల్లడించారు. తాను రాజకీయ పార్టీని పెట్టాలనుకోవడంలో ప్రధాన ఉద్దేశం ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదేనని చెప్పిన ఆయన, ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వాతావరణం ఏమాత్రం బాగోలేదన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. రాజకీయ అనుభవం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అలాగే ఇతర నేతల నుంచి కూడా పాఠాలు నేర్చుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎన్నికల్లో పోటీకి అవసరమైన నిధులను సమీకరించుకోగలనన్న ధీమాను వ్యక్తం చేసిన ఆయన, ప్రపంచవ్యాప్తంగా వున్న తమిళ ప్రజలు కొత్త ఆలోచనలతో ముందుకొచ్చి తనకు సహకరించాలన్నారు.