బిజినెస్

సింగరేణి ఆణిముత్యాలు,

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: సింగరేణి ఆణిముత్యాలు, ఉద్యోగ మేళా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) జనగాం నాగయ్య ఆయా ఏరియా అధికారులను ఆదేశించారు. శనివారం సింగరేణి భవన్‌లో జిఎం అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాకు కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా సింగరేణి ఉద్యోగుల పిల్లలు, మాజీ ఉద్యోగుల పిల్లలు, భూ నిర్వాసితుల కోసం ఉద్దేశించి ఈ ఉద్యోగ మేళా జరుగుతోందని తెలియజేస్తూ అందుకు తగిన విధి విధానాలను ఖరారు చేశారు. టెన్త్, ఇంటర్ ఒక గ్రూపు, డిగ్రీ, పిజి ఒక గ్రూపు, ఐటిఐ, డిప్లోమా, ఇంజినీరింగ్ ఒక గ్రూపు, ఇతరులను మరో గ్రూపుగా విడదీసి ఈ ఉద్యోగ మేళాకు యువతను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియను దాదాపు అదే రోజు ముగించి ఫలితాలను కూడా అదే రోజు ప్రకటిస్తారని చెప్పారు. ఉద్యోగ మేళా ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. పక్కా ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు జరగాలని కింది స్థాయి సిబ్బందిని ఆయన ఆదేశించారు.