బిజినెస్

కృష్ణపట్నం కేంద్రంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 11: భారతదేశంలో మరో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు 900 కిమీ నిడివి గల సముద్రతీరం ఉన్నందునే దేశ విదేశాలకు సముద్ర ఉత్పత్తుల రవాణా కోసం కృష్ణపట్నంలో స్నోమాన్ లాజిస్టిక్స్ వేర్ హౌస్‌ను 3600 పాలెట్స్ సామర్ధ్యంతో ఏర్పాటు చేశామని ఆ సంస్థ చైర్మన్ ప్రేమ్‌కిషన్ గుప్తా ఆదివారం నాడిక్కడ వెల్లడించారు. రానున్న రెండేళ్లలో దశలవారీగా దీన్ని 10వేల పాలెట్స్‌కు విస్తరించనున్నామని ఆ సంస్థ సీఈవో సునీల్ నాయర్ తెలిపారు. తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగానే కృష్ణపట్నం వద్ద టంపర్‌బార్ కంట్రోల్ వేర్ హౌసింగ్ కేంద్రాన్ని ఇటీవలే ప్రారంభించామన్నారు. అక్కడి గేట్‌వే డిస్ట్రిపార్క్స్, లాజిస్టిక్స్ పార్క్స్‌లో 3600 పాలెట్స్ సామర్ధ్యం గల టెంపర్ బార్ కేంద్రాలతో పాటు అదనంగా 10వేల చదరపు అడుగుల్లో డ్రై వేర్ హౌజింగ్‌ను ఏర్పాటుచేశారు.
ఇందులో అన్ని రకాల సదుపాయాలతో పాటు ఏడు హ్యాండ్లింగ్, లోడింగ్ బేస్, జి ప్లస్ కాల్‌లేకింగ్ సిస్టమ్స్, బ్లాస్ట్ ఫ్రీజింగ్, భిన్న రకాల టెంపర్‌బార్ చాంబర్లు అత్యంత ఆధునిక హ్యాండ్లింగ్ ఏర్పాటు, ఇతర సదుపాయాలు కల్పించామన్నారు. ప్రత్యేకంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఒక డెడికేటెడ్ యాప్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇలాంటి కేంద్రాలను కోల్‌కత్తా, విశాఖ, భువనేశ్వర్, కొచ్చిన్, ముంబయి, చెన్నైలో నిర్వహిస్తున్నామన్నారు.