మణికర్ణికకు అడ్డంకులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ సంచలన చిత్రం దీపికా పదుకొనె నటించిన పద్మావతి సినిమాకు ఎన్ని అడ్డకులు ఎదురయ్యాయో అందరికీ తెలుసు. అన్ని అడ్డంకులను దాటుకుని సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది ఈ చిత్రం. ఇప్పుడు అ తరహాలో బాలీవుడ్‌లో రూపొందుతున్న మణికర్ణిక సినిమాపై విమర్శలు వస్తున్నాయి. కంగనా రనౌత్ ముఖ్యపాత్రలో తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ కథతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో లక్ష్మీభాయ్ పాత్రను వక్రీకరిస్తున్నారని రాజస్థాన్‌లోని ఓ బ్రాహ్మణ వర్గం ఆరోపిస్తూ ఈ సినిమా షూటింగ్‌ను అడ్డుకుంటామని తెలిపింది. నిజానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతోపాటు ఇంకా కొన్ని కార్యక్రమాలలు ఉండడంతో విడుదలను ఆగస్టు 3కు వాయిదా వేశారు. సినిమా చూడకుండా పాత్రను వక్రీకరిస్తున్నారని అనడం సరికాదని యూనిట్ చెబుతోంది. పద్మావతి సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ముందు సినిమా చూసిన తరవాత మాట్లాడమని యూనిట్ సభ్యులు చెబుతున్నారట.