విదేశీ నటులతో సూపర్ స్కెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాల సరిహద్దులు ఏనాడో చెరిగిపోయాయి. మనదగ్గర కలెక్షన్ల వర్షం ఎంత కురుస్తుందో ఓవర్‌సీస్‌లోనూ అలాగే ఓవర్‌ఫ్లో అవుతోంది. వసుదైక కుటుంబం అయిన ఈ తరుణంలో తెలుగు చిత్రాల్లో విదేశీ నటులు కూడా ఆరుదుగా సందడి చేస్తున్నారు. తాజాగా సూపర్ స్కెచ్‌లోనూ విదేశీ తారాగణం కనిపించనుంది. మైండ్ గేమ్ కానె్సప్టుతో రూపొందుతున్న చిత్రమిది. రవికుమార్ చావలి దర్వకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణతో శ్రీమన్నారాయణ, జగపతిబాబుతో సామాన్యుడు, అక్కినేని సుమంత్‌తో దగ్గరగా దూరంగా, నిఖిల్‌తో విక్టరీ, ఆదితో ప్యార్ మే పడిపోయ, ది ఎండ్ వంటి చిత్రాలు అందించిన దర్శకుడు రవికుమార్ చావలి. తాజాగా ఆయన మరికొంతమంది కొత్తవాళ్ళను ప్రోత్సహిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమే ఈ సూపర్ స్కెచ్. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి, మాగంటి, అనికా, శుభాంగి, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాంటోని (ఇంగ్లాండ్) ఇందులో కీలక పాత్రధారులు. యారో సినిమా సమర్పణలో యు అండ్ ఐ ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీశుక్ర క్రియేయన్స్ నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు రవిచావలి మాట్లాడుతూ- గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో వైవిధ్యమైన పాయింట్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల పనుల్లో భాగంగా డబ్బింగ్ జరుగుతోంది. మనవాళ్ళతోపాటు విదేశీ నటుల పాత్రలు కూడా మెప్పిస్తాయి. సురేందర్‌రెడ్డి కెమెరా అందిస్తుండగా, జునైద్ ఎడిటింగ్, కార్తిక్ కొడకండ్ల సంగీతాన్ని అందిస్తున్నారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు.