మంచి మాట

సహనమే భూషణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశం అభివృద్ధి పథం వైపు వేగంగా దూసుకుపోతున్న ఈ కీలక తరుణమందు మతం కేంద్రంగా పరిభ్రమిస్తున్న వరుస సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. ఈ సంఘటనలు పునరావృతమవుతూ ఉంటే నల్లేరుపై నడకలా సాగుతున్న జీవన స్రవంతికి గండిపడే అవకాశం వుంది. మొదటినుంచి ఈ కర్మభూమిలో సనాతన ధర్మం కేంద్రంగా హిందూ మతం వెల్లివిరుస్తూ వుంది అంటే అందులో అతిశయోక్తి లేదు. నిజానికి హిందూ మత స్థాపకులు ప్రత్యేకించి ఎవరూ లేరు. ఈ దేశ సంస్కృతి ఆచార వ్యవహార సంప్రదాయాలు, ధర్మము ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా అందించుట వలన నేటికి హిందూ ధర్మం వర్థిల్లుతోంది.
ఈ భరత ఖండంనందు ఆర్యులు వంటి వారు వలస వచ్చి స్థిరపడి ధర్మరూపకల్పనలో భాగస్వాములు అయినారు. ఈ దేశ సంపదను సంప్రదాయ ధర్మములు విచ్ఛిన్నం చేయుటకు అనాదినుంచి ఎందరో ఎంతో ప్రయత్నం చేశారు. ఈ సనాతన ధర్మమే వీరిని కాపాడుతోందని గ్రహించిన వారు అధర్మం నుంచి జాతిని దూరం చేసేందుకు ప్రయత్నించారు. చిత్రహింసలు పెట్టారు. ప్రలోభాలు పెట్టారు కాని ధర్మాచరణ, సత్కర్మ, అహింసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా భారతీయులు మొక్కవోని ధైర్యంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు.
ప్రపంచంలోని అనేక మతములు తమ మతం ఒకటే ఈ జగతి యందు సత్యము శాశ్వతమని జీవన గమ్యం సులభంగా చేరుస్తామని చెబుతాయి. కాని సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే జీవన గమ్యం చేరుటకు పలుదారులు ఉన్నాయి. అందులో సనాతన ధర్మమనే హిందూమతం ఒకటి అని చెప్పే సహనం పరిణతిగల జాతిమనది. హిందూ మతం ముఖ్యంగా ఆచరణ కేంద్రంగా ఉంటుంది. సనాతన ధర్మ మతానుసారం మతం అంటే విధిగా ఆచరించవలసిన కర్తవ్యం. నేటికి ఈ సనాతన ధర్మం సజీవంగా ఉంది అంటే ఏ ఒకరో ఇద్దరో మాత్రం కారణం కాదు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దానికి అనుగుణంగా జీవితమును మలుచుకున్న ప్రతివాడు హిందూ సనాతన ధర్మ ప్రచారకుడే. తరగని ఆధ్యాత్మిక సంపదను తరువాతి తరాలకు అందించే ప్రతి ఒక్క సనాతన హిందువు లక్ష్యం.
ధర్మం, పరోపకారం, అహింస, గౌరవం మూల స్తంభములుగా గల సనాతన ధర్మం మన ధర్మమును మించిన ధర్మం వేరొకటి లేదు, తప్పక ఆచరించండి అని ఎవరిని బలవంతపెట్టలేదు, ప్రలోభపెట్టలేదు. అంతకంటే ఎవరిని బెదిరించలేదు. దేవతా స్వరూపములుగా, వాహనములుగా పశు జాతిని పక్షి జాతిని గుర్తించి స్థానమిచ్చిన మతం మనది.
ఈ మతమునందు ఆశావాదులుంటారు. సనాతన ధర్మం లేదా హిందూ మతం అడుగంటిపోయి కేవలం చెప్పుకోడానికే మిగిలిపోతుందేమో అనే భయంతో గూడిన బాధతో ధర్మప్రచారము కొందరు చేస్తూ యుండవచ్చు. ఈ ప్రయత్నంలో సనాతన ధర్వావలంబి ఎన్ని ఆపదలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికి సహనం శరణం గచ్ఛామి అంటున్నాడే కాని ఎక్కడా అసహనపు పోకడలు ప్రదర్శించలేదు. నేను అనే భావన నుండి మేము, మనము మన సాటివారు అనే భావనకు శ్రీమాన్ ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస బాటలు వేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, తత్త్వవేత్త రమణ మహర్షి, జన్మించిన ఈ దివ్యభూమిని వేదాలు, ఉపనిషత్తులు, సనాతన ధర్మం ఆవిర్భవించిన ఈ వేదభూమిని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని విదేశీయులు సైతం తహతహలాడుతూ ఉంటే అడక్కుండానే అన్నీ ఇచ్చిన ఈ కర్మభూమిని మనం పవిత్రంగానే పూజించుకుందాం. మనమందరూ ధర్మాచరణలో ముందుందాము. సత్యం, ధర్మమూ మన ఊపిరిగా ఉందాం. అపుడే ఇలలో స్వర్గాన్ని మనం చూడవచ్చు. భారతదేశమూ ఎల్లపుడూ సస్యశ్యామలంగా, వైభవోపేతంగా ఉండడానికి ఇక్కడి వారందరూ ధర్మాన్ని ఆచరించటమే.

-వేదగిరి రామకృష్ణ