కృష్ణ

శివరాత్రికి ముస్తాబైన శ్రీబాలకోటేశ్వర స్వామి ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఫిబ్రవరి 12: మండల పరిధిలోని పాతఎడ్లలంకలో మంగళవారం జరగనున్న మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఇఓ కె వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలకు విచ్చేయనుండటంతో కృష్ణానది తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పుష్కర ఘాట్ వద్ద భద్రత ఏర్పాట్లు చేశారు.
మహాశివరాత్రికి ముస్తాబైన శైవాలయాలు
కూచిపూడి, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి సందర్భంగా మొవ్వ మండలంలోని పెదపూడి, అయ్యంకి, గూడపాడు, నిడుమోలు, కాజ, కోసూరు, అవిరిపూడి, కూచిపూడి, మొవ్వ గ్రామాలలోని శివాలయాలలో తెల్లవారు జాము నుండి అభిషేకాలు నిర్వహించేందుకు అర్చకులు సన్నాహాలు పూర్తి చేశారు. కూచిపూడి కేంద్రంగా మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ ఆర్టీసి డిపోలు ఐలూరుకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేశారు.
పాలకవర్గం ఆలయ పవిత్రతను కాపాడాలి
* ఎమ్మెల్యే కల్పన
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 12: మహాశివరాత్రికి ఐలూరు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఉత్సవ కమిటీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏ ర్పాట్లు చూడాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఐలూరు శ్రీరామేశ్వరస్వామి దేవస్థానం, శ్రీరఘునాయకస్వామి దేవస్థానాల ఉత్సవ కమిటీలతో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మహా శివరాత్రికి చేపట్టిన చర్యలను మేనేజర్ యు జయశ్రీ వివరించారు. 16వ తేది వరకు జరిగే ఉత్సవాలను రామేశ్వరస్వామి దేవస్థానం, రఘునాయకస్వామి దేవస్థానాల్లో కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తుండాలని కల్పన కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిడుగు రాఘవులు, రామేశ్వరస్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు, రఘునాయకస్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు అప్పికట్ల వెంకటస్వామి సభ్యులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ రుణ లబ్ధిదారులకు ప్రత్యక్ష ఉత్తర్వులు
* కలెక్టర్ లక్ష్మీకాంతం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 12: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రత్యక్ష ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూపొందించిన ప్రత్యక్ష ఉత్తర్వులను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెసీ-2 బాబూరావు, డీఆర్‌ఓ అంబేద్కర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు ఎన్‌వివి సత్యనారాయణ, పెంటోజీరావు, డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు తదితరులు పాల్గొన్నారు.