Others

రోమన్ల సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సంవత్సరం ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే పద్ధతి రోమన్లది. ఫిబ్రవరి 14ను రోమన్లు శుద్ధీకరణ పండుగగా జరుపుకునేవారు. అలా కొంతకాలానికి ప్రణయోత్సవంగా మారిపోయింది. ఆ రోజున యువతీ యువకులు ఇష్టాగోష్ఠులు జరుపుకొని, అమ్మాయిల పేర్లను చీటీలమీద వ్రాసి ఒక డబ్బాలో వేసి డ్రా తీసిన తర్వాత ఒక అబ్బాయికి ఏ అమ్మాయి పేరు వస్తుందో ఆ రోజు అంతా కూడా కలిసి విచ్చలవిడిగా తిరిగే పద్ధతి ఉండేది. సాధారణంగా ఇలాంటి జంటలు పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఈ పండగను నేడు పాశ్చాత్యులు ‘వాలెంటైన్ డే’గా పరిగణిస్తూ ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజున అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరికొకరు గ్రీటింగ్ కార్డ్సు ఇచ్చుకునేవాళ్ళు. ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం వారి పద్ధతి. భర్తలు భార్యలకు, విద్యార్థులు టీచర్లకు కానుకలు ఇచ్చేవారు. అసలు వాలంటైన్ అనే పేరు దీనికి పెట్టడానికి వెనుక పెద్ద కారణం ఒకటి ఉంది. క్రీ.శ. 270వ సం.లో ప్రేమకోసం ప్రాణాలను త్యాగం చేసిన వాలెంటైన్ అనే ప్రేమికుడి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. రోమన్ చక్రవర్తి అయినటువంటి 2వ క్లాడియస్ తన దేశంలో పెళ్లిచేసుకున్న యువకులు ఉన్నట్లయితే యుద్ధంలో ఏకాగ్రతగా ఉండరని భావించి పెళ్లిళ్ళు చేయడానే్న నిషేధించాడు. కానీ వాలంటైన్ అనే పౌరుడు ఆ శాసనాన్ని ధిక్కరించి ప్రేమికుల్ని ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రేమ వివాహాలు జరిపించేవాడు. ఈ విషయం రోమన్ చక్రవర్తి చెవిన పడడంతో వాలెంటైన్‌కు శిరచ్ఛేద శిక్ష విధించడం జరిగింది. తనకు మరణకాలం సమీపిస్తున్నకొద్దీ వాలెంటైన్ తాను శిక్ష అనుభవించే జైలు కిటికీలోనుంచే తన గదివైపు ఉన్న చెట్టుకొమ్మకు ఉన్నటువంటి పూలపై ‘వాలెంటైన్‌ను గుర్తుంచుకో’ అనే అక్షరాలను తన యొక్క రక్తంతో రాసి జైలర్ కూతురికి అర్పించాడనేది ఒక కథనం అని చరిత్ర చెబుతోంది. మరి ఇలాంటి చరిత్ర తెలిసీ తెలియక ఇప్పటి యువత ప్రేమికుల రోజును జరుపుకుంటున్నది. వాలెంటైన్ ప్రేమకోసం పరితపించిన విషయం తెలియకున్నా ‘వాలెంటైన్స్ డే’ను జరుపుకుంటున్నారు. అలాంటి చరిత్ర చెప్పే నిజాలు తెలుసుకోకుండా యువత కేవలం ప్రేమ, ఆకర్షణల మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించిన మనిషి దక్కకపోతే చనిపోతున్నారు. ప్రేమను గెలిపించుకోలేక చనిపోతున్నారు. ప్రేమించి పెళ్లిచేసుకుని పరువు హత్యలు చేయబడుతున్నారు. ఇక ఒక వ్యక్తి ఎన్నాళ్ళనుంచో ప్రేమిస్తున్నాడని తెలిసినా అమ్మాయిలు తమను పట్టించుకోకపోవడంతో అబ్బాయిలు దాడులు చేస్తున్న సంఘటనలు సమాజంలో ప్రతిరోజు ఎన్నో చూస్తూనే ఉన్నాము. వీటన్నింటికీ కారణం ఆకర్షణ, ఆలోచన లేని నిర్ణయాలు, వ్యామోహం, మోజు, ఒక దశలో కొంతమంది తమ కామవాంఛ తీర్చుకోవడానికి కూడా ప్రేమ అనే వలను ఉపయోగిస్తారు. ఆచారాలు, సంప్రదాయాలు కాని వాటికోసం వేలు, లక్షల్లో ఖర్చులు పెట్టడం ఎందుకు? జీవితాలను బలిచేసుకోవడమెందుకు? యువత ఇప్పటికైనా మేల్కొనాలి. తమ బరువు బాధ్యతలపై దృష్టి పెట్టాలి. మానసికంగా కృంగిపోయి మరణాలను ఆహ్వానించవద్దు.
..............
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-శ్రీనివాస్ పర్వతాల