Others

నిరీక్షణకు అంతం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు పొద్దులూ
శీతల పవనాలూ
ఈదురు గాలులూ
శిశిరం రాకకు సంకేతాలు!
విరజాజులు విచ్చుకునే వేళలూ..
కౌముదీ కాంతులు వెదజల్లే
వెనె్నల జలపాతాలూ..
తొలి ఝాములో
నా కళ్ళలో దాగిన
కలల కేరింతలూ..
నీ రాకను సూచించే
మధురమైన భావనావీచికలు!
నువ్వు నా కోసం
నడచి వస్తావని
ఆ రహదారిని
అందగా అలంకరించాను!
అరుణిమను పులుముకున్న
నీ లేలేత పాదద్వయం
కందిపోయి నిన్ను నొప్పింపక
హాయిగా అలరించాలని..
సుగంధాలు వెదజల్లే
మల్లెలను.. సంపెంగలను..
సుకుమార శోభితమైన
ముద్దమందారాలను..
బంతులను.. చేమంతులను..
ఆ బాట నిండా
తివాచీలా పరిచాను!
మరులు నిండిన మనసుతో
నా నయనాలలో...
నక్షత్ర కాంతులను నింపుకొని
క్షణం.. క్షణం..
నీ రాక కోసం
ఆ దారివైపే
చూస్తూ వున్నాను!
ప్రేమికుల రోజు..
నా ఎద తలుపులు తట్టి
నా హృదయ సామ్రాజ్యంలో
రాణిగా వెలుగొందుతావని
గుండె లోతుల్లో
ఆశలెన్నో పెంచుకున్నాను!
చెలీ..
ఏ సుదూర తీరాలను
కాపలా కాస్తున్నావ్?
ఎంతకాలమిలా..
ఎదురుతెన్నులు!?

-విడదల సాంబశివరావు