క్రీడాభూమి

భవిష్యత్‌లో కోచింగ్ ఇస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 13:ఇంకా ఒకటి రెండేళ్లపాటు క్రికెట్ ఆడతానని, ఆ తరువాతే రిటైర్మెంట్ ఆలోచన చేస్తానని ప్రఖ్యాత ఆటగాడు యువరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తరువాత బహుశా కోచింగ్‌పై దృష్టిసారిస్తానని, ముఖ్యంగా చిన్నారులకు క్రికెట్ ఆటలో శిక్షణ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బీసీసీఐ ప్రకటించిన జట్లలో యువరాజ్‌కు అవకాశం దక్కలేదు. యువ ఆటగాళ్లు మనీష్ పాండే, కేదార్ జాదవ్ వంటివారితో గట్టిపోటీ ఎదురవడంతో యువరాజ్‌కు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో జనవరి నెలాఖరులో జరిగిన ఐపీఎల్ తాజా సీజన్‌కు గాను జరిపిన వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆయనను కొనుగోలు చేసింది. కేన్సర్‌నుంచి కోలుకున్న తరువాత యువరాజ్ అంతర్జాతీయ పోటీల్లో అడపాదడపా పాల్గొన్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్‌కే పరిమితమైనాడు. స్పోర్ట్‌స్టార్ వీడియోచానల్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ తన ఆలోచనలను పంచుకున్నాడు. ‘యు కెన్, వియ్ కెన్’ సంస్థ తరపున కేన్సర్‌పై పోరాటాన్ని కొనసాగిస్తానని, చిన్నారులకు మద్దతు ఇవ్వడం తనకు ఇష్టమని పేర్కొన్న యువరాజ్ యువతరంతో తరచూ మాట్లాడుతూంటానని అన్నారు. వారికి క్రికెట్‌లో శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉందని, దివ్యాంగులైన చిన్నారులను గుర్తించి వారికి క్రికెట్ ఆట నేర్పిస్తానని ఆయన అన్నారు. క్రీడలు, చదువుపై వారు శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహిస్తానని, క్రీడల కోసం చదువును పణంగా పెట్టడం సరైన పని కాదని ఆయన అన్నారు.
అయితే క్రికెట్‌నుంచి తప్పుకోవాలనుకోవడం లేదని, అది తన ప్రాణమని, ఏమీ చేయలేని స్థితిలో తప్పుకోవాలనుకోవడం లేదని, నేను సాధించాల్సినది పూర్తయిన తరువాతే నిష్క్రమిస్తానని ఆయన చెప్పారు. ఇంకా నేను ఆడగలుగుతున్నానని, ఆటలో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నానని అన్న యువరాజ్ భారత్ తరపునే కాదు ఐపీఎల్‌లోనూ ఆడుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొని, పోరాడి నెగ్గుకొచ్చానని, జీవితంలో కేన్సర్ సహా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నవారికి భరోసా కల్పించేలా తాను కార్యక్రమాలు చేపడతానని యువరాజ్ అన్నారు.