క్రీడాభూమి

నెం.1 స్థానంపై ఫెథరర్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొట్టెర్‌డామ్, ఫిబ్రవరి 13:పురుషుల టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని మళ్లీ సాధించాలని ప్రఖ్యాత ఆటగాడు రోజర్ ఫెదరర్ కలలుగంటున్నాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన అతి ఎక్కువ వయస్సున్న క్రీడాకారుడిగా నిలుస్తాడు. స్విస్‌కు చెందిన ఫెదరర్ ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు. అయితే అతడి కల నెరవేరాలంటే ఈవారం జరగనున్న రొట్టెర్‌డామ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. ప్రఖ్యాత ఆటగాడు, గట్టి ప్రత్యర్థి వావ్రింకా క్వార్టర్స్‌లో తలపడుతున్న ఫెదరర్ నెగ్గితేనే ఇది సాధ్యమవుతుంది. ‘మళ్లీ నెంబర్‌వన్ స్థానానికి చేరాలని భావిస్తున్నా. అయితే ఎవరితోనైనా తలపడి ఆ స్థానానికి చేరుకోవచ్చు. కానీ క్వార్టర్ ఫైనల్‌లో వావ్రింకా జరిగే పోటీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లా ఉంటుందని అనుకుంటున్నా’ అని ఫెదరర్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోటీ చేసి 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఫెదరర్ రొట్టెర్‌డామ్ టోర్నీలో పాల్గొనాలని ఆలస్యంగా నిర్ణయించుకున్నాడు. గతంలో 2005, 2012లో ఫెదరర్ ఈ టోర్నీల్లో పాల్గొని టైటిల్ నెగ్గాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోటీపడినప్పుడు నెంబర్‌వన్ స్థానంపై దృష్టిపెట్టలేదని, కానీ ఈసారి అలా కాదని చెప్పాడు. కాగా ఈ టోర్నీలో తొలి పోటీ బెల్జియమ్‌కు చెందిన రూబెన్ బెమెల్మాన్స్‌తో తలపడనున్నాడు.