క్రీడాభూమి

జాక్సన్ బర్డ్‌కు దక్కని చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఫిబ్రవరి 13:సౌతాఫ్రికాలో పర్యటించనున్న ఆస్ట్రేలియా టెస్టు జట్టులో పేస్‌బౌలర్ జాక్సన్ బర్డ్‌కు చోటు దక్కలేదు. కాలి కండరాల గాయాలతో బాధపడుతున్న బర్డ్ స్థానంలో మరో స్పీడ్ బౌలర్ చాద్ సేయర్స్‌కు అవకాశం కల్పించారు. బ్రిస్బేన్‌లో గత వారం దేశవాళీ పోటీల్లో ఆడినప్పుడు బర్డ్ గాయాలపాలయ్యాడు. దీంతో మూడువారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోవలసి రావడంతో దక్షిణాఫ్రికా టూర్‌కు దూరమయ్యాడు. ఇది జాక్సన్‌కు విచారాన్ని, చాద్‌కు ఆనందాన్ని కలిగిస్తుందని తనకు తెలుసునని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించారు. నిజానికి గత సీజన్‌లో 62 వికెట్లు పడగొట్టిన బర్డ్ ఆస్ట్రేలియా జట్టులో కీలక బౌలర్. మార్చి 1 నుంచి సౌతాఫ్రికాలో ఇరుజట్ల మధ్య పోటీలు ప్రారంభమవుతాయి.