బిజినెస్

భారత్ ఫార్మా రంగాన్ని నియంత్రిస్తున్న విదేశీ రెగ్యులేటరీ మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరుగుతున్న బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో భారత ఫార్మా రంగాన్ని నియత్రించే విధంగా అమెరికా, ఐరోపా మార్కెట్ల విధానాలను సమీక్షించనున్నారు. దీని వల్ల ఫార్మా రంగం నష్టాలను ఎదుర్కొంట్నున్న అంశాలపై చర్చించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ లైఫ్ సైనె్సస్ సిఇవో శక్తినాగప్పన్ తెలిపారు. బయో ఆసియా, డెలాయిట్ సంస్థలు భారత్ ఫార్మా కంపెనీలపై అధ్యయనం చేశాయి. 2016-17 సంవత్సరం ఫార్మా రంగానికి అత్యంత క్లిష్టమైన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు. విదేశీ నియంత్రణ మండళ్ల జోక్యం విపరీతంగా పెరిగిందన్నారు. దీని వల్ల ఫార్మా ఎగుమతులు 0.43 శాతం మేర తగ్గాయన్నారు. దేశీయంగా ఫార్మా రంగం అమ్మకాలు 2016-17లో 4.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకుంది. ఈ దశాబ్ధంలో అత్యంత తక్కువ వృద్ధిరేటు ఇదేనని ఆయన చెప్పారు. ఎగుమతులు చేసే ఫార్మా కంపెనీలకు 14 డ్రగ్ జిఎంపి లేఖలు వచ్చాయి. ఇందులో ఎఫ్‌డిఏ ఆరు లెటర్స్ జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైనె్సస్ ఇండస్ట్రీలో రసాయనిక తయారీ ఔషధాల నుంచి బయాలజిక్స్ తయారీ ఔషధాల తయారీ రంగానికి మారుతున్నాయని శక్తినాగప్పన్ చెప్పారు. ఈ రంగంలో ఉత్పత్తుల వృద్ధిరేటు 24 శాతం ఉండగా, 2020 నాటికి 27 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు.ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లున్న టర్నోవర్, వచ్చే మూడేళ్లలో 12 బిలియన్ డాలర్లకు పెరగనుంది.