బిజినెస్

వేసవి విద్యుత్‌కు అంచనాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: వేసవి విద్యుత్ అవసరాలకు సంబంధించి అంచనాలు సిద్ధమవుతున్నాయి. దీనిపై సంస్థ యాజమాన్యం లెక్కలు కడుతోంది. వేసవి సీజన్ ఆరంభం అవుతున్న నేపథ్యంలో మార్చి నుంచి వరుసగా మూడు మాసాలపాటు నిరంతరాయ విద్యుత్‌ను అందివ్వడం, అంతరాయాల్లేని సరఫరాతో పరిశ్రమలను ఆదుకోవడం, వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను పటిష్ఠంగా అమలు చేయడమే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ పరిధిలోకి వచ్చే ఐదు జిల్లాలకు సంబంధించి గత ఏడాది రోజుకీ మూడు వేల మెగావాట్ల వరకు వినియోగం జరిగింది. ఈసారి దీనికంటే మరో 500 మెగావాట్ల మేర అదనంగా వినియోగం జరుగవచ్చని అంచనా యాజమాన్యం అంచనా వేస్తోంది. వాస్తవానికి దాదాపు 300 మెగావాట్ల కంటే అదనంగా అవసరం ఉంటుందని లెక్కలు కడుతుండగా అందుబాటులో మరికొంత ఉంచుకోవాలని సంస్థ నిర్ణయించింది. అయితే, దీనికి తగినట్టుగా ఏపీ ట్రాన్స్‌కో సహకరిస్తుందా? లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ట్రాన్స్‌కో పరిధిలో ఉండే సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచుకునేందుకు కొద్దిరోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది రోజుకీ ఐదు జిల్లాలకు సంబంధించి ఏకంగా 3500 మెగావాట్ల వరకు వినియోగం జరుతుందని అంచనా వేసిన ఈపీడీసీఎల్ దీనికి తగినట్టుగా విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ ట్రాన్స్‌కోతో సమన్వయం కావాల్సి ఉంది. అందువల్ల దీనిపై ఈ నెల 21వ తేదీన ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీ ట్రాన్స్‌కో, సంస్థ ఉన్నతాధికారులు సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఈ ఏడాది అసలు ఎంత విద్యుత్ అవసరం ఉంటుంది? దీనిని ట్రాన్స్‌కో ఇవ్వగలదా? ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉంది? సరఫరా సామర్థ్యానికి తీసుకుంటున్న చర్యలేమీటి? సాంకేతికపరమైన సమస్యలను అధిగమించేందుకు చర్యలేమిటి? అనే కీలక అంశాలు ఈ సమన్వయ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఏపీ ట్రాన్స్‌కోకు సంబంధించిన గాజువాక సమీపానున్న కలపాక 400కెవి సబ్‌స్టేషన్, దీని పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు మొదలయ్యాయి. అయితే, కొత్తగా ఈ ఏడాది విజయనగరం జిల్లా మరడాం ప్రాంతంలో ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన 400కెవి సబ్ స్టేషన్ నిర్మించనున్నారు. దీనివల్ల ఏకంగా 800 మెగావాట్లకు పైగానే విద్యుత్‌ను పొందవచ్చు. అలాగే ప్రతి ఏడాది కలపాక 400కెవి సబ్‌స్టేషన్‌లో నెలకొన్న సాంకేతికపరమైన సమస్యలను అధిగమించవచ్చు. మరడాం సబ్ స్టేషన్ వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది కూడా. దీనిని ఈ నెలాఖరికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అనుకున్నట్టుగా ఇది పనిచేయడం ప్రారంభిస్తే ఈ వేసవి సీజన్ గట్టెక్కినట్టే. కాగా, ఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి విద్యుత్ సర్వీసుల సంఖ్య దాదాపు 48 లక్షలకు చేరుకుంది. ప్రతి ఏడాది గృహాలు, వాణిజ్య, పరిశ్రమలతోపాటు వ్యవసాయ సర్వీసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. వీటన్నింటికీ తగినంత విద్యుత్‌ను అందివ్వాలంటే ఏపీ ట్రాన్స్‌కో గ్రిడ్ ద్వారా పంపిణీ సంస్థకు అందివ్వాలి. ఈ విధంగా రెండింటి సమన్వయంతోనే ఈ వేసవి సీజన్‌ను గట్టెక్కెందుకు చర్యలు మొదలయ్యాయి.