Others

సర్వం శ్రీకృష్ణ మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరివీర భయంకరులైన రాక్షసా ధములను ఒంటిచేత్తో మట్టి కరిపించినవాడు మఱ్ఱి ఆకుపై పవళిం చిన వాడే ఒక్కడే. పాండవులను నీడలా కనిపెట్టి ఉంటూ లక్కఇంటిలో కాలి పోకుండాను, అడవుల్లో అవమానం లేకుండాను కాపాడినవాడు ఒక్కడే. దుర్యోధనాది గర్వపోతుల గర్వాన్ని అణిచివాడు, ధృతరాష్ట్రులాంటి గుడ్డివా రి మదం మణిచినవాడు ఒక్కడే. కుచే లుని దాపునకు తీసుకొని అతని దారి ద్య్రాన్ని అడగకుండానే పోగొట్టిన వాడు, సంగడీలతో గోవులను కాచుటకు వెళ్లి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపోయే ట్టుగా చద్దిమూటను ఆరిగించినవాడు ఒక్కడే. ఇంద్ర పూజలు ఆపు చేయంచి, గోవర్థన గిరిపూజ చేయంచినా, చన్ను బాలు గ్రోలు తూనే పూతన ప్రాణాలు హరీ మనిపించినా జ్జశకటా సురభం జనాథి వీరుల వికట్టాహాసంతో వికృత రూపంతో విగతజీవుని చేసినా ఒక్క గోపాలబాలునకు, గోవిందునకు, యశోదావత్సలునకు మాత్రమే చెల్లింది. అందుకే అర్జునుని ఉపాధిగా పెట్టుకొని సర్వమానవాళికి గీతోపదేశం చేసాడు. సర్వధర్మాలను వదిలి కేవలం తన్ను మాత్రమే తలుచుకొంటే చాలు వారి వారి యోగ క్షేమాలను చూస్తానని చెప్పే ఆ గీత కారుడు భీష్ముని చేత విష్ణు సహస్ర నామావళిని చెప్పించాడు. ఇంతచేసి అల్లరివాడు అని గోపికలచేత అనిపించుకున్నవాడూ అతడే. అంతా అర్థమయనట్లుగానే కనిపింప చేస్తూ ఏమి అర్థం కానట్టుచేసే నేర్పరి వసుదేవ సుతుడు, దేవకీ నందనుడు, ఆ బాల గోపాలానికి దృష్టి యతడే. అతణ్ణి వేడుకుంటే చాలు. అతని నామాలు స్మరిస్తే చాలు. అతని చేతలను నోరారా చెబితే చాలు. చెవులతో వింటేచాలు. లోకమంతా కృష్ణమయంగా కనిపిస్తుం ది. రాముడుగా పుట్టి దశరథునికి మాత్రమే కొడుకునన్నా మొక్కిన వారే, దేవకీదేవి కడుపున పండి యశోద ఒడి లో పెరిగి నన్ను మించిన వేల్పు లెవడే అని గదమాయంచినా చేతులెత్తి మొ క్కులు గైకొనువాడతడే రుక్మిణీపతి, సత్యభామావిధేయుడు.

- చివుకుల