బిజినెస్

భారం కానున్న ఉన్నత విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 14: ప్రభుత్వాల నిర్ణయాలతో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులపై అధిక భారం పడుతోంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తు రుసుములు గత ఎడాదితో పోలిస్తే 80శాతం వరకు పెరగనున్నాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులపై లక్షలాది రూపాయల భారం పడనున్నది. ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయిలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు హజరవుతున్నారు. ఈ పరీక్షల ఫీజులను ఆన్‌లైన్ విధానంతో చెల్లిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ఈ ఎడాది పరీక్షల నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యా మండలి టీసీఎస్ కంపెనీకి అప్పగించింది. ఇందు కు గాను ఒక్కొ విద్యార్థి ఆ సంస్థకు 420 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 18శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఐసెట్‌కు గత ఎడాది ఎస్సీ, ఎస్టీలకు 250 రూపాయలు, ఇతరులకు 350 రూపాయలు ఉండగా, ఈ ఎడా ది వాటి ని ఎస్సీ, ఎస్టీలకు 450 రూపాయలు, ఇతరులకు 650 రూపాయలుగా నిర్ణయించారు. దీని ప్రకారం జీఎస్టీని కలుపుకొని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై 80 శాతం, ఇతరులపై 85 శాతం భారం పడుతోంది. పరీక్ష ఎదైనా కనీస రుసుము 400 రూపాయలుగా ఉన్నత విద్యామండలి నిర్ణయించటంతో ఎస్సీ, ఎస్టీలు మినహ మిగిలిన వారిపై అదనంగా 200 రూపాయల వరకు భారం పడుతుంది. ఐసెట్‌ను నిర్వహించే కాకతీయ యూనివర్సిటి ఫీజులను ఇప్పటికే ప్రకటించటంతో మిగిలినవి కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీసెట్, లాసెట్, ఈసెట్‌లతో పాటు ఇతర సెట్‌లకు కూడా రాష్ట్రం నుండి పరీక్ష రాసే లక్షలాది మంది విద్యార్థులపై జీఎస్టీ రూపంలో పడే భారా న్ని తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఉంది. విద్యార్థులపై పాలకులు మరింత భారాన్ని మోపుతున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి.