సైంటిస్టుగా మోక్షజ్ఞ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 100వ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆయన లేటెస్ట్‌గా ‘ఆదిత్య 369’ సీక్వెల్ రానుందని నందమూరి బాలకృష్ణ స్వయంగా తెలిపారు. ఈ చిత్రం ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడన్న విషయం కూడా ఆయనే తెలిపారు. దీంతో ఈ చిత్రంలో మోక్షజ్ఞ ఎలా కన్పిస్తాడా అనే ప్రశ్న ఆయన అభిమానుల్లో తలెత్తింది. నిజానికి అతడిని సోలో హీరోగా పరిచయం చేస్తారని అనుకున్నారు. కాని ఇప్పుడు బాలయ్య సినిమాలోనే యువరాజు పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా మోక్షజ్ఞ ఓ సైంటిస్టు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. టైం మెషిన్‌కు సంబంధించిన చిక్కుముడిని విప్పే ఓ గణిత మేథావి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడని తెలిసింది. ఈ పాత్రలో మోక్ష కేవలం 10 నిముషాలు మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది.