క్రీడాభూమి

సిరీస్ ఓటమితో గిబ్సన్ నిరాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 14: భారత్ చేతిలో ఆరు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఐదో వనే్డ ముగిసే సమయానికే 1-4 తేడాతో కోల్పోవడం దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్‌ను నిరాశకు గురి చేసింది. మొదటి మూడు వనే్డల్లో పరాజయాలను చవిచూడడంతో, దక్షిణాఫ్రికా తీవ్ర ఒత్తిడికి గురైందనేది వాస్తవం. నాలుగో వనే్డను గెల్చుకున్నప్పుడు, కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఒత్తిడి మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ఐదో మ్యాచ్‌ని ఆ జట్టు ఆడిన తీరే స్పష్టం చేసింది. మొదటి మూడు మ్యాచ్‌లకు గాయం కారణంగా ఏబీ డివిలియర్స్ అందుబాటులో లేకపోవడం, ఫఫ్ డు ప్లెసిస్, క్వింటన్ డి కాక్ కూడా దూరం కావడం జట్టును కోలుకోలేని దెబ్బతీశాయని ఒక ఇంటర్వ్యూలో గిబ్సన్ వ్యాఖ్యానించాడు. అయితే, సిరీస్ పరాజయానికి కారణాలను వెతుక్కోవడం లేదని అతను స్పష్టం చేశాడు. ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్ సేవలను ఏదో ఒక దశలో కోల్పోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, తుది జట్టు కూర్పు చాలా కష్టమవుతుందని గిబ్సన్ అన్నాడు. అందులోనూ భారత్ వంటి అత్యంత బలమైన జట్టును ఢీకొనే సమయంలో గాయాల సమస్య తలెత్తడం దురదృష్టకరమని వాపోయాడు. టీమిండియా అద్భుతంగా ఆడిందని కితాబునిచ్చాడు. ఈ సిరీస్‌లో ఎన్నో అంశాలు తన దృష్టిలోకి వచ్చాయమని, వాటి ఆధారంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటామని అన్నాడు. భారత యువ స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌ను గిబ్సన్ ప్రత్యేకంగా అభినందించాడు. వారిద్దరు చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో రాణించారని అన్నాడు.

దట్టమైన మంచు..
ఆపై అతి శీతల గాలులు..
ఆల్‌పైన్ రేసులకు అంతరాయం
పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 14: దట్టమైన మంచు ఒకవైపు.. బలంగా వీస్తున్న అతి శీతల గాలులు మరోవైపు.. ఆల్‌పైన్ విభాగంలో పోటీలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఇక్కడికి సమీపంలోని యాంగ్‌పయాంగ్‌లో జరగాల్సిన ఆల్‌పైన్ మహిళల సాలమ్ పోటీలను తొలుత బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరోసారి ఆధిపత్యాన్ని కనబరచాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా సూపర్ స్టార్ మిఖయేల షిఫ్రిన్స్ తన రేసు కోసం రెండు రోజులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే, బుధవారం కూడా ఆమెకు నిరాశ తప్పలేదు. వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని, అందుకే పోటీలను శుక్రవారానికి వాయిదా వేశామని అంతర్జాతీయ స్కీ సమాఖ్య (ఎఫ్‌ఐఎస్) ప్రకటించింది. ఇలావుంటే, డౌన్‌హిల్ ట్రైనింగ్ సెషన్స్‌ను వరుగా మూడోసారి రద్దు చేశారు. కాగా, దట్టంగా పేరుకుపోతున్న మంచును ట్రాక్స్ పైనుంచి ఎప్పటికప్పుడు తొలగించడంలో సిబ్బంది తల మునకలయ్యారు. వారు ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ, శిక్షణకు కూడా ట్రాక్స్‌ను సిద్ధం చేయడం సాధ్యం కావడం లేదు. బలమైన గాలుల వేగానికి ఇండికేటర్లు కొట్టుకుపోయాయి. వాటిని తిరిగి వాటి స్థానంలో ఉంచడం తలకు మించిన భారంగా మారింది. మొత్తం మీద ఆల్‌పైన్ రేసుల వాయిదా అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది.