క్రీడాభూమి

వైట్ గెలిచాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 14: నాలుగేళ్ల క్రితం దారుణంగా విఫలమై, ఇంటా బయటా విమర్శలకు గురైన అమెరికా స్నోబోర్డ్ లెజెండ్ షాన్ వైట్ పయాంగ్‌చాంగ్‌లో గెలిచాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నాలుగేళ్లుగా బాధను అనుభవించిన అతను ఈసారి వింటర్ ఒలింపిక్స్ స్నోబోర్డ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. స్వర్ణ పతకాన్ని స్వీకరించిన తర్వాత ఉద్వేగాన్ని ఆపుకోలేక బిగ్గరగా రోదించాడు. 3్ఫ్లయింగ్ టోరంటో2 అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే వైట్ 2006, 2010 సంవత్సరాల్లో స్వర్ణ పతకాలను సాధించాడు. దీనితో, 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌లో విజయం సాధించి, హ్యాట్రిక్‌ను నమోదు చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా అతను నాలుగో స్థానానికి పడిపోయాడు. కనీసం కాంస్యం కూడా అందుకోలేకపోయిన వైట్‌పై అప్పట్లో విమర్శలు చెలరేగాయి. మీడియా కూడా అతనిని లక్ష్యంగా చేసుకొని, ఎన్నో వార్తా కథనాలతో హడావుడి చేసింది. కానీ, వైట్ ఏ దశలోనూ సంయమనం కోల్పోలేదు. విమర్శకులపై ప్రతివిమర్శలు చేయలేదు. సోచీలో తాను చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడంపైనే దృష్టి పెట్టాడు. నిరంతరం శ్రమించాడు. నాలుగేళ్ల అతని కృషి ఫలిచింది. ఈసారి పోటీల్లో 31 ఏళ్ల వైట్ మొత్తం 97.75 పాయింట్లు సంపాదించి, విజేతగా నిలిచాడు. జపాన్‌కు చెందిన అయూమీ హిరనో చివరి వరకూ వైట్‌కు పోయినిచ్చినప్పటికీ, 95.25 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. స్కాటీ జేమ్స్ (ఆహ్ట్రేలియా) 92 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించి, కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

ఎందుకిలా?
జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 14: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.. ఇద్దరూ ఇద్దరే. ప్రపంచ క్రికెట్‌లో, ప్రత్యేకించి వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఎన్నో రికార్డులను వారు పంచుకుంటున్నారు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎంత ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారో అదే స్థాయిలో విమర్శలకు కూడా గురవుతున్నారు. వీరితో కలిసి బ్యాటింగ్ చేయడానికి టీమిండియా ఆటగాళ్లు భయపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. లేని పరుగు కోసం ప్రయత్నించడం, తాము రనౌట్ కావడం, లేదా ఎదుటివారిని రనౌట్ చేయడం ఈ ఇద్దరు హీరోలకు అలవాటుగా మారింది. వీరిద్దరూ ఒకరినొకరు రనౌట్ చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. పోర్ట్ ఎలిజబెత్‌లో మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వనే్డలో ఇద్దరు రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. బలపడుతున్న వీరి భాగస్వామ్యం కోహ్లీ రనౌట్‌తో ముగిసింది. వీరు భాగస్వాములుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఒకరు రనౌట్ కావడం అది ఏడోసారి. రోహిత్ మూలంగా కోహ్లీ ఐదో సారి రనౌటయ్యాడు. కోహ్లీ వల్ల రోహిత్ రెండు సార్లు వికెట్ పారేసుకున్నాడు. సౌరవ్ గంగూలీ, సచిన్ తెండూల్కర్ ఒకరినొకరు రనౌట్ చేసుకొని, ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉంటే, రెండో స్థానాన్ని ఆక్రమించిన కోహ్లీ, రోహిత్ వారి రికార్డును బద్దలు చేసే దిశగా దూసుకెళుతున్నట్టు కనిపిస్తున్నది. ఎందుకిలా వీరు రనౌట్ల రికార్డు వెంట పరుగులు తీస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.