క్రీడాభూమి

కొన్ని మార్పులున్నా విజయమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, ఫిబ్రవరి 14: తమ జట్టులో కొన్ని మార్పులతో ఆరో వనే్డలో బరిలోకి దిగుతామని, అయితే, తమ లక్ష్యం మాత్రం విజయం సాధించడంపైనే ఉంటుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆరు వనే్డల సిరీస్‌లో ఇప్పటికే 4-1 తేడాతో మంచి ఊపుమీదనున్న భారత్ శుక్రవారం జరిగే ఆఖరి మ్యాచ్‌పై దృష్టి సారించింది. మంగళవారం జరిగిన ఐదో మ్యాచ్‌లో కోహ్లీ సేన 73 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. కరేబియన్ గడ్డపై తొలిసారిగా వనే్డ సిరీస్ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. సిరీస్ తర్వాత తామంతా కూర్చుని ఆట తీరు మరింత మెరుగుపరుచుకునేందుకు చర్చించామని అన్నాడు. ఇప్పటికే ప్రత్యర్థిపై 4-1 తేడాతో గెలుపొందిన ఉత్సాహం ఉన్నా, 5-1 తేడాతో గెలుపు సాధించాలనుకుంటున్నామని అన్నాడు. సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో తమ జట్టులోని కొద్దిమంది యువకులకు మంచి ఛాన్స్ వస్తుందని ఆయన వ్యాఖ్యానించాడు. ‘మా ప్రథమ కర్తవ్యం గెలుపు సాధించడం. గెలిచేందుకు ఏమైనా చేస్తాం’ అని కోహ్లీ అన్నాడు. ఐదో వనే్డలో తమ జట్టు సభ్యులు అద్భుతంగా ఆడినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఇదిలావుండగా ప్రత్యర్థి జట్టు సిరీస్‌ను కోల్పోయినందుకు వారిపై మరింత ఒత్తిడి పెరుగుతుందన్న విషయం తనకు తెలుసునని వ్యాఖ్యానించాడు. జోహానె్సస్‌బర్గ్‌లో జరిగిన మూడో టెస్టు తర్వాత తమకు మంచి అంతా కలసి వచ్చిందని, ఈ ఘనత అంతా సమష్టి నిర్ణయంతోనే సాధ్యమైందని అన్నాడు.
ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో టీమిండియా విజయం యావత్ దేశంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది. దక్షిణాఫ్రికాలో, దక్షిణాఫ్రికా జట్టుపై భారత్‌కు మొట్టమొదటిసారి ఒక సిరీస్‌లో విజయాన్ని అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సహచరులపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. పలువురు ప్రముఖులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, వివిధ క్రికెట్ సంఘాల అధికారులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికాలో భారత్ ఏ ఫార్మాట్‌లోనూ సిరీస్ కైవసం చేసుకోలేదు. వనే్డ ఇంటర్నేషనల్స్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌ను కోహ్లీ సేన కోల్పోయినప్పుడు, వనే్డ సిరీస్ తీరు ఎట్లా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, నాలుగో వనే్డ చేజారడంతో, పొరపాట్లను సరిదిద్దుకున్న భారత క్రికెటర్లు ఐదో వనే్డలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిలకడగా ఆడలేకపోతున్న ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి సెంచరీ సాధించడంతో భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 274 పరుగులు చేయగలిగింది. కోహ్లీ 54 బంతుల్లో 36 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌటైన విషయం తెలిసిందే. అనంతరం 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా తొలిసారి అక్కడ ఒక సిరీస్‌ను సొంతం చేసుకుంది. జట్టు మొత్తం సమష్టిగా కృషి చేయడం వల్లే సిరీస్‌ను టీమిండియా సాధించగలిగిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. మొదటిసారి దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను గెల్చుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ ట్వీట్ చేశాడు.

ఆరు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాపై భారత్‌కు 4-1 తేడాతో సిరీస్‌ను అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానులు జేజేలు పలుకుతున్నారు. ఒక వనే్డ ఇంటర్నేషనల్ ద్వైపాక్షిక సిరీస్‌లో 400 పరుగుల మైలురాయిని అధిగమించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కిన కోహ్లీని అంతా ముక్త కంఠంతో అభినందిస్తున్నారు. గతంలో ఈ ఘనతను సాధించిన రోహిత్ శర్మ సరసన స్థానం సంపాదించుకున్న కోహ్లీ ఈ సిరీస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మొత్తం 429 పరుగులు చేశాడు. రోహిత్ 2013-14లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో 491 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాలో మరో వనే్డ మిగిలి ఉన్న నేపథ్యంలో, కోహ్లీ ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు. వారి అంచనాలకు తగినట్టు కోహ్లీ చివరి వనే్డలో రాణిస్తాడో లేదో చూడాలి.

ఐదో వనే్డలో రెండో వికెట్‌కు 105 పరుగులు జోడింకోహ్లీ, రోహిత్ శర్మ (ఫైల్‌ఫొటో)