ఆంధ్రప్రదేశ్‌

డ్రోన్లతో రాజధాని నిర్మాణ పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 14: రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, చేపట్టిన ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గృహ నిర్మాణం, రహదారులు, ఇతర వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంలో ఎవరైనా విఫలమైతే ఉపేక్షించేది లేదన్నా రు. సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సహకారం తీసుకుని 15 రోజులకు ఒకసారి డ్రోన్లతో తీసిన చిత్రాలను తనకు చూపించాలని అధికారులకు సూచించారు. చేపట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తేనే పెట్టుబడిదారులు ముందుకు వస్తారన్నారు. పనులకు సంబంధించిన యంత్ర సామగ్రి, మెటీరియల్ విషయంలో ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

chitra...
సీఆర్‌డిఏ, ఏడీసీ అధికారులతో పనుల తీరును
సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు