రాష్ట్రీయం

భూపరిహారంపై అంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: వచ్చే బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ కింద నష్టపరిహారం నిమిత్తం రూ.458 కోట్లను కేటాయించి అర్హులైన వారికి చెల్లించని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. ఆంధ్ర ప్రభుత్వం భూసేకరణ నష్టపరిహారం చెల్లింపు కేసులకు సంబంధించి ప్రస్తావించిన అంకెలపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. దిగువ కోర్టులు భూసేకరణపై నష్టపరిహారం చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి జి వెంకట కృష్ణయ్య రాసినలేఖను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు విచారించింది. ఈ కేసును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మి విచారించారు. గతంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు భూసేకరణ నష్టపరిహారం చెల్లింపుపై వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివరాలను సిఎస్‌లు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో భూసేకరణ నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి రూ. 62 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ నష్టపరిహారం చెల్లింపు సొమ్ము అంకెలపై ప్రశ్నించింది. మార్చి 31లోగా రెండు రాష్ట్రాల్లో వివిధ కోర్టుల్లో భూసేకరణ నష్టపరిహారం చెల్లింపుల తీర్పులు, ఆదేశాలపై వివరాలను తమకు సమర్పించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తమ రాష్ట్రంలో 918కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి సంబంధించి రూ.84.32 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, రూ.21.55 కోట్లను ఇప్పటికే డిపాజిట్ చేశామని, మరో మూడు నెలల్లో మొత్తం పరిహారం చెల్లిస్తామని పిటిషన్‌లో ఏపి ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం 1669 కేసుల్లో వీటికి సంబంధించి రూ. 457.79 కోట్లను చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా ఈ మొత్తం సొమ్మును చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకటనను నమోదు చేస్తున్నామని, ఇచ్చిన మాట మేరకు నిర్దేశించిన కాలంలో నష్టపరిహారం చెల్లించని పక్షంలో తీవ్రపరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేశారు.