హైదరాబాద్

నేటి నుంచి ‘స్వచ్ఛ’ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: స్వచ్ఛ భారత్ సాధనలో భాగంగా దేశంలోని అన్ని మహానగరాలు, పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పరీక్షలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే నగరంలో స్వచ్ఛ్భారత్ మిషన్‌కు చెందిన బృందాలు ప్రజలను కలిసి ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్వే చేయనుంది. గత సంవత్సరం సర్వేలో 22వ ర్యాంకుతో సరిపెట్టుకున్న నగరం దేశంలోని ఇతర మెట్రోనగరాలతో పోల్చితే మెరుగైన స్థానానే్న దక్కించుకుంది. ఈ సారి సర్వేక్షణ్‌లో దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు కాస్త ముందు నుంచే జీహెచ్‌ఎంసీ ‘స్వచ్ఛ’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి నగరంలో స్వచ్ఛ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బుధవారం గ్రేటర్‌లోని అన్ని సర్కిళ్లలోని వీధివీధిలో చెత్తకు విడాకులు దినోత్సవాన్ని బల్దియా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉద్యమ స్పూర్తితో నిర్వహించారు. కేంద్ర స్వచ్ఛ్భారత్ మిషన్ నియమించిన కార్వీ కన్సల్టెన్సీకి చెందిన మూడు బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి నగరవాసులను స్వచ్ఛతపై పలు ప్రశ్నలు అడిగే అవకాశమున్నందున, వారి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వీలుగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సినీ సెలబ్రిటీలు దగ్గుబాటి రాణా, అమల, ఘాన్సీ తదితర ప్రముఖులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 12న బాగ్‌లింగంపల్లిలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రచారానికి ఆరంభంలోనే ఆదరణ అదుర్స్ అన్పించింది. ఏకంగా 15వేల చిలుకు నగర పౌరులు పాల్గొని, రోడ్లను శుభ్రపరిచారు.
మనం చేయాల్సిందేమిటీ?
దేశవ్యాప్తంగా నాలుగు వేల పైచిలుకు మహానగరాలు, పట్టణాల్లో జరుగుతున్న ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగ్యనగరానికి అగ్రస్థానం దక్కాలంటే నగర పౌరులుగా మనం మన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. 1969కు కాల్ చేసినా, మిస్డ్ కాల్ ఇచ్చినా, తిరిగి కాల్ వస్తోంది. ఆరు ప్రశ్నలకు సానుకూలమైన సమాధానం చెప్పి, నగరాన్ని స్వచ్ఛ సిటీగా తీర్చిదిద్దుకోవటంలో భాగస్వాములు కావాలి. మొత్తం నాలుగువేల మార్కులకు ఈ సర్వే నిర్వహిస్తుండగా, 1400 మార్కులను క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు చెందిన బృందాలు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం వస్తే కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గుర్తించి.. నగరవాసులు సానుకూలకంగా సమాధానం చెప్పాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి కోరారు.