కృష్ణ

అందరికీ అందుబాటులో న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 14: అందరికీ అందుబాటులో న్యాయసేవలు అందించటం జరుగుతుందని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వరలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని వెల్వడం పంచాయితీ కార్యాలయంలో న్యాయవిఙ్ఞన సదస్సు జరిగింది. ఈసదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావటానికే న్యాయవిజ్ఞాన సదస్సులు ఉపయోగపడతాయన్నారు. సామాన్యునికి అందుబాటులోకి న్యాయం కోసం న్యాయస్థానాలున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజ్యాంగంలో విధులు, బాధ్యతలు, హక్కులను తెలుసుకుని మసలుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు, పౌరులు పాల్గొన్నారు.

మనస్పర్థలు రూపుమాపుకునేందుకే
పార్టీ సమావేశాలు

పెదపారుపూడి, ఫిబ్రవరి 14: మండల పార్టీలో అంతర్గత అవగాహన లోపం కారణంగా దాన్ని సరిచేయాలని పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. బుధవారం భూషణగుళ్ళలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నచిన్న మనస్పర్ధలు పెద్దవి కాకూడదన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దగల సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతినెలా సమావేశాలను నిర్వహించాలన్నారు. వ్యక్తిగత విమర్శలకు వెళ్ళకుండా పార్టీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. పదవుల కోసం పోట్లాడేకునే వారు పార్టీ అభివృద్ధికి కూడా పోరాడాలన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఈ నెల్లో రూ.25లక్షలు అందించడం జరిగిందన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరగడ్డ రమేష్‌నాయుడు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ప్రతినెలా తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ పార్టీకీ లేని విధంగా టీడీపీకి నెట్‌వర్క్ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు బుజ్జిబాబు, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ హరీష, వైస్ ఎంపీపీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.