కృష్ణ

వౌలిక వసతుల కల్పనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 14: పట్టణంలో సీసీ రోడ్లు, మంచినీటి సరఫరాకు, డ్రైనేజీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్ అన్నారు. స్థానిక 13, 21 వార్డులలో బుధవారం చైర్మన్ బాబాప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 13వ వార్డు ఆర్‌కెమెస్ దగ్గర రూ.1.30లక్షలతో హెచ్‌డీపీఐ పైప్‌లైన్‌కు, స్థానిక 21వ వార్డు జొన్నవిత్తుల వారి వీధిలో రూ.2.50లక్షలతో, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద రూ.3.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మారుమూల ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు చైర్మన్ బాబాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాధం, కౌన్సిలర్లు మొవ్వ పార్వతి, బొడ్డు శ్రీనివాస్, మోదుగుమూడి శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

టార్గెట్ మేయర్ శ్రీ్ధర్
* మార్పు కోరిన కార్పొరేటర్లు
* మేయర్, కార్పొరేటర్ల వివాదంపై పార్టీ పెద్దల సమావేశం
* క్రమశిక్షణ మీరితే ఎంతటి వారినైనా ఉపేక్షేది లేదు
* అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న
* వివాదాలపై కార్పొరేటర్లు, మేయర్‌తో ముగిసిన సమావేశాలు
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 14: పార్టీ పరువు, ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండాలంటే తక్షణమే మేయర్ కోనేరు శ్రీ్ధర్‌ను మార్చాల్సిందేనని టీడీపీ కార్పొరేటర్లు పట్టుపట్టారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్, టీడీపీ కార్పొరేటర్ల మధ్య కొద్ది కాలంగా నెలకొన్న వివాదాల పరిష్కారంలో భాగంగా అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న నిర్వహించిన సమావేశంలో కార్పొరేటర్లు స్పష్టం చేసిన తీరుతో వీఎంసీ టీడీపీలో చర్చనీయాంశమైంది. బుధవారం ఉదయం నగరంలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో కార్పొరేటర్లతో, మధ్యాహ్నం మేయర్ కోనేరు శ్రీ్ధర్‌తో సమావేశాలు జరిపి వివాదాలకు గల కారణాలను సమీక్షించారు. నగర పాలనలో అధికార సిబ్బందిపై అనుసరించే అనుచిత వ్యవహారంతోపాటు తోటి సహచర కార్పొరేటర్లుగా ఉన్న తమపై మేయర్ శ్రీ్ధర్ నియంతృత్వ పోకడలపై ఏకరవు పెట్టారు. కార్పొరేట్లు అవినీతి పరులంటూ, మీడియాలో ఆరోపణలు చేసిన తీరు, డివిజన్ అభివృద్ధి పనుల నిర్వహణకు మంజూరు చేయాల్సిన నిధుల మంజూరులో కూడా సహకరించడం లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పిన కార్పొరేటర్లు, మేయర్ ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకే నష్టం వాటిల్లుతుందంటూ ముక్తకంఠంతో నిరసించిన కార్పొరేటర్లు మేయర్‌ను తక్షణమే మార్చాలని డిమాండ్ చేయడం గమనార్హం. మరికొంత మంది సీనియర్ కార్పొరేటర్లు కూడా ఈ డిమాండ్‌కు మద్దతు పలికి తాము కూడా శ్రీ్ధర్ మాదిరిగానే పార్టీ కోసం కష్టపడిన వారిమేనని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము కూడా పార్టీ కోసం పనిచేశామన్న విషయాన్ని గుర్తించి తమ రాజకీయ భవిష్యత్తు కల్పించాలంటూ సీనియర్ కార్పొరేటర్లు తమ వాదనను వినిపించినట్టు కార్పొరేటర్లు తెలిపారు. సమావేశం అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ క్రమ శిక్షణ మీరితే ఎంతటి వారిపైన అయినా కఠిన చర్యలు తప్పవని, సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లందరూ తమ వాదనలు విపినిపించారని, ఎక్కువ శాతం మంది మేయర్ మార్పును కోరారని తెలిపారు. వీరి అభిప్రాయాలను పార్టీ అధిష్టానం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నారా లోకేష్‌కు నివేదికను అందజేస్తామన్నారు. అయితే మేయర్ మార్పుపై నిర్ణయం అధిష్టానందేనని, తేల్చి చెప్పిన బుద్దా మేయర్ పదవి మార్పులు ఉండవన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు, మేయర్ మధ్య సఖ్యత, సమన్వయం కల్పించి నగర పాలనలో అందరూ భాగస్వాములయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేటర్ల ఆవేదనను గుర్తించిన పార్టీ ఇకనుంచి వారికి తగిన ప్రాధాన్యత కల్పించేలా మేయర్‌కు సూచిస్తామన్నారు. మధ్యాహ్నం మేయర్ కోనేరు శ్రీ్ధర్‌తో సమావేశమైన బుద్దా వెంకన్న సఖ్యత, సమన్వయంతో పనిచేయాలని, ఇటువంటి కార్పొరేటర్ల వ్యతిరేక భావాలు పునరావృతం కాకుండా అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. అయితే ప్రస్తుత సమావేశాలతో వివాదం పూర్తిగా పరిష్కారం కాలేదంటూ పలువురు కార్పొరేటర్లు పెదవి విరిచారు. నగర పాలన మొత్తాన్ని ఒకే ఒక వ్యక్తికి కట్టబెట్టి ఆయననే సమర్థిస్తున్న పార్టీ అధిష్టానం, నేతల వైఖరిని తప్పుపట్టిన కార్పొరేటర్లు భవిష్యత్తు ప్రణాళికపై వ్యూహరచన చేస్తున్నారు. ఈ సమావేశంలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్ట్భా తదితరులు పాల్గొన్నారు.

ముద్రగడ లేఖ వెనుక రాజకీయ కుట్ర
* యువ కాపునాడు నేత విమర్శ
విజయవాడ, ఫిబ్రవరి 14: ప్రత్యేక హోదా అంశంలో జనసేన నేత పవన్ కళ్యాణ్‌ను బలిచేయవద్దంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయటం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో విమర్శించారు. జగన్ ప్రతినిధిగా ఆయన లేఖ రాసినట్లు కన్పిస్తోందన్నారు. ఇప్పటికైనా కులాల మధ్య చిచ్చుపెట్టడం మాని రాష్ట్భ్రావృద్ధి, ప్రత్యేక హోదా సాధన, కాపుల సంక్షేమం కోసం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చారు. రెండు దశాబ్దాల పాటు టీడీపీ ద్వారా మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ముద్రగడ తిరిగి తన సొంత గూటికి రావటంలో తప్పులేదన్నారు. జగన్ కుట్రకు బలికాకుండా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని కోరారు. పవన్ కళ్యాణ్‌ను అవమానిస్తూ మాట్లాడుతున్న ముద్రగడ తక్షణం క్షమాపణలు చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్భ్రావృద్ధి కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఉత్తమ ఫలితాల సాధన
ఉపాధ్యాయుల బాధ్యత
* పాఠశాల తనిఖీలో కలెక్టర్ లక్ష్మీకాంతం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 14: కలెక్టర్ బి లక్ష్మీకాంతం బుధవారం సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహనరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల విద్యకు అన్ని సదుపాయాలు కల్పిస్తోందని, విద్యార్థులకు సరైన అవగాహనతో పాఠాలు చెప్పే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. గణితం, భౌతిక శాస్త్రాల్లో విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించే విద్యార్థులకు అల్పాహారం అందించాలని హెచ్‌ఎంకు ఆదేశించారు. కలెక్టర్ పాఠశాల ఆవరణలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధవౌతున్న విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. గణితం, భౌతిక శాస్త్రాల బోధనలపై విద్యార్థుల నుండి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. చదువు అనేది ఒక వరంగా భావించి చక్కగా చదువుకుని భవిష్యత్‌లో ప్రతిభావంతులుగా తయారుకావాలని ఆకాంక్షించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతున్న తీరును అక్కడ భోజనం చేస్తున్న పిల్లలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం బాగుందని విద్యార్థులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాంచారయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్విమ్మింగ్ విజేతకు సత్కారం
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 14: కజికిస్తాన్‌లో ఈ నెల 8 నుంచి 12 వరకు జరిగిన ఇండో-కజికిస్తాన్ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని 3 బంగారు, ఒక కాంస్య పతకం సాధించిన శాప్ కోచ్ జి సురేష్‌ను శాప్ ఎండీ ఎస్ బంగారురాజు ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు శాప్ అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో బి శ్రీనివాసరావు, సిరాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

నేడు స్వామివార్ల రథోత్సవం
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం పాతబస్తీ కెనాల్ రోడ్ సెంటర్ నుండి స్వామివార్ల రథోత్సవ ఊరేగింపు ఘనంగా జరగనుంది. శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో స్వామివార్ల రథోత్సవ ఊరేగింపు సుమారు వందేళ్లుగా నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది. గురువారం సాయంత్రం రథోత్సవ ఊరేగింపును నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రారంభిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం (పాత శివాలయం), బ్రాహ్మణవీధి శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి దేవస్థానం (బుద్దావారి గుడి), తదితర ఆలయాల నుండి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై ఉంచుతారు. తర్వాత వైభవంగా స్వామివార్ల రథోత్సవ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు, ఎంపీ, శాసనమండలి విప్, నగరానికి చెందిన పలువురు వీఐపీలు పాల్గొంటారని సత్రం కమిటీ నిర్వాహకులు తెలిపారు. రాత్రి కల్యాణం నిర్వహించుకున్న స్వామివారు సర్వ ఆభరణాలు ధరించి సతీ సమేతంగా రథాన్ని అధిష్ఠించి నగర ప్రజలకు దివ్య దర్శ నం ఇవ్వనున్నారు. రథం ముందుభాగంలో మేళతాళాలు, భూత భేతాళ వే షాలు, పులి, సింహం వేషాలు, భక్తి సంకీర్తన, కోలాటాన్ని కళాకారులు ప్ర దర్శిస్తారు. రథోత్సవ ఊరేగింపును తి లకించేందుకు జిల్లావ్యాప్తంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలి రానున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున సహాయ ఈవో శ్రవణం అ చ్యుతరామయ్య నాయుడు రథోత్సవా న్ని పర్యవేక్షిస్తారని దేవాలయ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

శ్మశానవాటికలో ఆక్రమణల తొలగింపు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14: కొండపల్లి గ్రామంలో శ్మశానవాటికను ఆక్రమించి అక్రమంగా వేసిన పాకలను పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులు తొలగించినట్లు కార్యదర్శి శివాజీ తెలిపారు. శ్మశానవాటిక భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు పరిశీలించి నిర్మాణాలను తొలగించామన్నారు. రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, నీలవేణి, పంచాయతీ ఇన్‌స్పెక్టర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
గుడిసెల తొలగింపు
అక్రమంగా నిర్మించిన 15 గుడిసెలను అటవీ, రెవెన్యూ శాఖ సిబ్బంది కలిసి తొలగించినట్లు సెక్షన్ అధికారి బీ లెనిన్‌కుమార్ తెలిపారు. మండలంలో ని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం లో అంబేద్కర్ నగర్, డీఏవీ స్కూల్ వె నుక వేసిన 15 గుడిసెలను రేంజ్ ఆఫీసర్ ఆర్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో తొలగించామన్నారు. ఎవరైనా అక్రమంగా అటవీ భూముల్లో నిర్మాణాలు జరిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. గుడిసెల తొలగింపులో బీట్ అధికారులు బీ శ్రీనివాసరావు, సుకుమార్, సుధాకరరావు, రెవెన్యూ శాఖ నుంచి నెలవెనె్న, నీలవేణి, తదితరులు పాల్గొన్నారు.