కృష్ణ

శివయ్య కల్యాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 14: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి దత్తత దేవాలయమైన మైలవరంలో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివయ్య కల్యాణం మంగళవారం అర్థరాత్రి కమనీయంగా, కన్నుల పండువగా సాగింది. స్వామి వారి కల్యాణాన్ని ఆలయ వేద పండితులు శ్రీనివాస దీక్షితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు నేతృత్వంలో కల్యాణాన్ని నిర్వహించారు.

కమనీయం బాలకోటేశ్వరుని కల్యాణం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వెల్వడంలో వేంచేసియున్న శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం అర్థరాత్రి స్వామి వారి కల్యాణం కమనీయంగా కన్నుల పండువగా సాగింది. ఆలయ ప్రధాన మండపంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఉంచి స్వామి కల్యాణాన్ని వేద పండితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కల్యాణం అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్నారైలు కల్యాణం సందర్భంగా భక్తులకు మంచినీరు, ఉచిత ప్రసాదాలు అందించారు. అంతకుముందు విద్యుత్ ప్రభ కనుల విందుగా గ్రామోత్సవం నిర్వహించారు. ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విచిత్రవేషధారణ, తీన్‌మార్ బ్యాండు, బాణసంచా మోతలతో వెల్వడం మారుమోగింది.

తెలుగుతమ్ముళ్ల బాహాబాహీ

పెదపారుపూడి, ఫిబ్రవరి 14: మండల టీడీపీ సమావేశంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయ. బుధవారం భూషణగుళ్ళలోని కల్యాణ మండపంలో జరిగిన మండల టీడీపీ సమావేశం రసాభాసగా సాగింది. మండల పార్టీ అధ్యక్షుడు సమావేశాలకు పిలవడం లేదని వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారు ఆరోపించారు. తాము టీడీపీలో చేరి ఏడాది దాటినా ఇంకా పార్టీ సమావేశాలకు ఆహ్వానాలకు నోచుకోవడం లేదన్నారు. పెదపారుపూడి సర్పంచ్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, తాను, తన భర్త కలిసి పనులు చేస్తుంటే అడ్డుపడుతున్నారని పేర్కొనడంతో పార్టీ అధ్యక్షుడి వర్గీయులు ఒక్కసారిగా వేదికపైకి దూసుకువచ్చారు. దీంతో మరో వర్గం కూడా వేదిక వరకు రావడంతో ఇరువర్గాలూ కలిసి సమావేశాన్ని రసాభాస చేశారు. ఇందులో కొంత మంది కుర్చీలను నేలకేసి కొట్టి విరగొట్టారు. దీంతో వేదికపై ఉన్న కొనకళ్ళ బుల్లయ్య సర్దిచెప్పినా ఆగలేదు.

జల్సాలకు దొంగతనాలు!

నూజివీడు, ఫిబ్రవరి 14: బంగారు భవిష్యత్‌కోసం బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు జల్సాల కోసం చోరీల బాటపడ్డారు. మోటారు సైకిల్‌పై వేగంగా వెళుతూ మహిళల మెడలోని గొలుసులను లాగేసుకుని, వాటిని అయనకాడికి అమ్ముకుని జల్సాలు చేస్తున్న ముగ్గురు విద్యార్థులు పట్టణ పోలీసులకు చిక్కారు. ఈ సంఘటనకు సంబంధించి డీఎస్పీ వి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం పట్టణ పోలీసుస్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ స్థానిక వెలమపేటకు చెందిన సబ్బవరపు సూర్యతేజ మండలంలోని వెంకటాద్రిపురం పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. మనోహర్ ఫిజియోథెరపీ, గాంధీనగర్‌కు చెందిన లోకాల ఫణీంద్ర మండలంలోని జంగంగూడెం ఐటీఐ కళాశాలలో చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగంగా యమహా షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. ఈ ముగ్గురు విద్యార్థులు జల్సాలకు అలవాటు పడ్డారు. యమహా మోటారు సైకిల్‌పై వీరు వేగంగా వెళ్తూ మహిళల మెడలోని బంగారు గొలుసులను కాజేయడం వీరి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. అదేవిధంగా తాళాలు వేసి ఉన్న ఇళ్ళలోకి ప్రవేశించి చోరీలు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ముగ్గురు విద్యార్థులను పట్టణ ఎస్‌ఐ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. వీరి నుండి బంగారు నల్లపూసల గొలుసులు మూడు, బంగారు గొలుసులు రెండు, బంగారు నానుతాడు ఒకటి, బంగారు చెవిదిద్దులు మూడు జతలు, బంగారు ముక్కు పుడకతో పాటు వెండి సామానులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుమారు రెండు లక్షల రూపాయల విలువ గల బంగారు, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. వీరిపై పట్టణ పోలీసుస్టేషన్‌లో నాలుగు, రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒకటి, హనుమాన్‌జంక్షన్ పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇనస్పెక్టర్ రామ్‌కుమార్, పట్టణ ఎస్‌ఐ సిహెచ్ రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మినుము దిగుబడులను దెబ్బతీస్తున్న తెగుళ్లు

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 14: మినుము దిగుబడులను వైరస్ తెగుళ్లు దెబ్బతీస్తున్నాయి. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పల్లాకు తెగులు పైరును కృంగతీసింది. ఈ నేపథ్యంలో పల్లాకు తెగులును అరికట్టేందుకు రైతులు విపరీతంగా క్రిమిసంహారక మందులను పిచికారీ చేనా ప్రయోజనం లేకుండా పోయింది. పల్లాకు తెగులు సోకిన మినుము పంట ఎకరం రెండు బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుండటంతో ఆయా రైతులు లబోదిబోమంటున్నారు. ఖర్చులు భారీగా పెరిగాయి తప్పితే పల్లాకు తెగులు మాత్రం అదుపులోకి రాలేదు. దీనికి తోడు కలుపు కూడా పెరగటంతో మినుము మొక్కలు కుచించుకుపోయాయి. పల్లాకు తెగులు నివారణకు రైతన్నలు విచ్చల విడిగా క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటం వల్లే వైరస్ తెగుళ్లు ఉదృతి పెరిగిందని పేర్కొంటున్నారు. చల్లపల్లి, ఘంటసాల, గూడూరు, బందరు, పెడన తదితర ప్రాంతాలలో సాగుచేసిన మినుము పైరు తెగుళ్ల బారిన పడింది. ఎక్కడ చూసినా పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పల్లాకు తెగులును తట్టుకునే రకాలను ఎంచుకోకపోవటం, విపరీతంగా క్రిమిసంహారక మందుల వాడకం, ముఖ్యంగా విత్తనశుద్ధి చేయకపోవటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని వ్యవసాయశాఖాధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది మినుము దిగుబడులు ఎకరాకు రెండు బస్తాలు నుండి 7 బస్తాల వరకు మాత్రమే వస్తాయని రైతులు చెబుతున్నారు.

రేపు అర్చక ఆత్మావలోకన సదస్సు

అవనిగడ్డ, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడ సమీపంలోని గొల్లపూడి సెంటరులోగల అయ్యప్పస్వామి కల్యాణ మంటపంలో అర్చక ఆత్మావలోకన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘం సభ్యులు వెంకట్రామాచార్యులు, బృందావనం సుధీర్ బాబు, రఘునాధాచార్యులు బుధవారం విలేఖర్లతో మాట్లాడుతూ తెలిపారు. ఈ సదస్సులో ఉదయం 8గంటలు నుండి లక్ష్మీగణపతి హోమం, సుదర్శన హోమం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ మంత్రి పి మాణిక్యాలరావు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ దశరధ జనార్ధన్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబులతో పాటు దేవదాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు.