మహబూబ్‌నగర్

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, ఫిబ్రవరి 15: జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు దాటుతున్న బాలుడిని ఢీకొన్న ఘటన గురువారం జడ్చర్లలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఎంబి మెడికల్ ఆసుపత్రి సమీపంలో కర్నూల్ నుండి హైద్రాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు చీపురి గుడిసేలకు చెందిన యాదయ్య కుమారుడు గిరి (8) ఢీ కొనడంతో ఆ బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకొన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు కలిచివేశాయి. వాహనం అతివేగమే బాలుడి మృతికి కారణమంటూ మృతుడి బంధువులు, స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ బాల్‌రాజ్ అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి కారణమైన కారును స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరపనున్నట్లు సీఐ బాల్‌రాజ్ తెలిపారు.

జిల్లా పోలీస్‌శాఖలో చేరిన రెండు జాగిలాలు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 15: కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూల్ జిల్లాకు పోలీస్ ఉన్నతాధికారులు రెండు జాగిలాలను కేటాయించగా, వాటిని గురువారం ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ సమక్షంలో డాగ్ హండ్లర్లు రిపోర్ట్ చేశారు. మోయనాబాద్‌లోని సీటీసీ ఐఐటీఏలో ఎనిమిది నెలల పాటు శిక్షణ కాలం పూర్తి చేసుకున్న రెండు పోలీస్ జాగిలాలను, ఇద్దరు డాగ్ హాండ్లర్‌లను నాగర్‌కర్నూల్ జిల్లాకు కేటాయించడంతో గురువారం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్‌కు రిపోర్టు అందజేసి జిల్లా పోలీస్ శాఖలో చేరారు. ఇందులో జాస్మీన్ (ట్రాకర్) అనే జాగిలం దొంగతనాలు, మర్డర్లు జరిగినపుడు గుర్తించే విధంగా శిక్షణ పొందగా, మరో జాగిలం రాణా (ఎక్స్‌ప్లొజర్) పేలుడు పదార్థాలను వాసన ద్వారా కనిపెట్టేలా శిక్షణ పొందింది. ఈసందర్భంగా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా దొంగతనాలు చేసేవారిని గుర్తించడానికి, మర్డర్లు చేసిన హంతకులను, పేలుడు పదార్థాలను గుర్తించడానికి ఈ జాగిలాలు పోలీస్ శాఖలో ముఖ్య పాత్ర వహిస్తాయన్నారు. సమాజంలో మనుషులతో పాటు సమానంగా తమ విధిని నిర్వర్తించడానికి, సమాజానికి సేవ చేసేందుకు దోహదపడుతాయన్నారు. జిల్లాలో ఈ జాగిలాల సేవలు నేటి నుండి అందుబాటులో ఉంటాయన్నారు.