మహబూబ్‌నగర్

పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 15: శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేయాలని మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేరసమీక్ష, శాంతిభద్రతల పరిరక్షణ సమీక్ష సమావేశంలో ఎస్పీ అనురాధ పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం అపారమైనదని అందువల్లే తమకు ఏ తరహా సమస్య ఎదురైన మొదటగా పోలీసులనే ఆశ్రయిస్తారని అన్నారు. సమాజానికి వెన్నంటే ఉంటూ వారి నమ్మకానికి అనుగుణంగా సిబ్బంది పనితీరు ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఇటివల కాలంలో జరిగిన దొంగతనాల విషయమై సమావేశంలో ప్రత్యేక చర్చ చోటుచేసుకోగా శివారు ప్రాంతాలు, అనుమానిత, వివాదాస్పదమైన ప్రదేశాలు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఆయుధాలతో కూడిన ప్రత్యేక పోలీసు బృందాల గస్తి, రక్షక్ వాహనాల్లో సిబ్బంది పెట్రోలింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పెర్కొన్నారు. స్థానిక ప్రజలకు సిబ్బంది అవగాహన కల్పిస్తూ దొంగతనాల నివారణకై పోలీసులు నిర్వహించిన సమావేశాల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. గ్రామపోలీసు వ్యవస్థను పటిష్టపర్చాలని గ్రామాల్లో జరిగే ప్రతి విషయం గ్రామపోలీసు అధికారికి సమాచారం ఉండాలని ఆ సమాచారం పోలీసుస్టేషన్‌కు సర్కిల్, డిఎస్పీ,జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా అందించాలన్నారు. గ్రామాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడితే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లాలో పలు రహదారులు ప్రమాదభరితంగా మారాయని ఇందుకు కారణం ప్రజలు వాహనాలను అతివేగంగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించి రోడ్డు ప్రమదాల నివారణకు గ్రామగ్రామాన సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రంక్ అండ్‌డ్రైవ్‌ను తరచూ నిర్వహించాలని దింతో మధ్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇటివల జరిగిన వివిధ కార్యక్రమాలు, వేడుకలు, జాతర్లలో జిల్లా పోలీసులు నిర్వహించిన బందోబస్తు పట్ల ఉన్నతాధికారులు ప్రశంసలు అందజేశారని సిబ్బంది చేసిన కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పెండింగ్ కేసులు, వారెంట్లు, ఉండడం వల్ల విచారణ ఆలస్యం అవుతున్న విషయం గుర్తించాలని ఆయా సర్కిళ్ల వారిగా ఈ అంశాలపై దృష్టి కేంద్రికరించాలని సూచించారు. లోక్ ఆదాలత్‌లో మంచి ఫలితాలు సాధించిన పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బందికి ఎస్పీ అనురాధ రివార్డులను అందజేశారు. ఇదే సందర్భంగా నేరపరిశోధన, కోర్డు విధులలో ప్రతిభ కనబర్చే సిబ్బందికి సురక్ష పోలీసు కళాజాత ద్వారా చక్కటి ప్రదర్శనలు అందిస్తున్న పోలీసు కళాకారులకు ఆమె నగదు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.