రాష్ట్రీయం

10లక్షల ఎకరాల్లో ‘సహజ సాగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 24: రాష్ట్రంలో రానున్న ఐదు సంవత్సరాల్లో 10 లక్షల మంది రైతులతో 10 లక్షల ఎకరాల్లో పెట్టుబడి లేని సహజ ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేలా ప్రోత్సహించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 3 లక్షల 12 వేల ఎకరాలలో సహజ ప్రకృతి వ్యవసాయం సాగయ్యేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సర్పవరం వద్ద 31వ తేదీ వరకు జరిగే పెట్టుబడి లేని సహజ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి మంత్రి ప్రత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి ప్రసంగిస్తూ స్వామినాధన్ కమిటీ సిఫార్స్‌లకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేస్తూ, దేశంలో వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఒక రోల్ మోడల్‌గా నిలిచేలా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాను 10 క్లస్టర్లుగా చేసి ప్రతి క్లస్టర్ నుండి 130 రైతుల వంతున సుమారు 6వేల మంది రైతులను ఎంపిక చేసి కాకినాడలో వారం రోజుల పాటు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్తవ్రేత్త సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో రైతులకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఈ రాష్టస్థ్రాయి శిక్షణ కార్యక్రమానికి 13 జిల్లాల నుండి రైతులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. సుభాష్ పాలేకర్ తన స్వరాష్టమ్రైన మహారాష్టల్రో 40 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని సాగుచేసి, అద్భుతమైన ఫలితాలు సాధించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారన్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులు పాల్గొని, ఉత్తమ శిక్షణ పొంది, మంచి ఫలితాలు సాధించగలరన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రసాయనిక ఎరువుల వాడకానికి భిన్నంగా సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవల్సిన బాధ్యత రైతులతో పాటు అందరిపై ఉందన్నారు.
10 శాతం నీరు, విద్యుత్ ఉంటే చాలు!
నూరు శాతం శాస్ర్తియతతో ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా సాగు చేయవచ్చని ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త సుభాష్ పాలేకర్ తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేస్తూ 10 శాతం నీరు, విద్యుత్ మాత్రమే ఇందుకు వినియోగించవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రకృతి వ్యవసాయ రంగంలో తీర్చిదిద్దేందుకు తాను దత్తత తీసుకుంటానని చెప్పారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించడం మన లక్ష్యమన్నారు.