బిజినెస్

అనంతలో ఆటోమేషన్ లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 16: కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలో పంట పొలాలను సస్యశ్యామలం చేసేందుకు ఆటోమేషన్ సిస్టమ్ ద్వారా లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ (ఎత్తిపోతలు, తుంపర్ల సేద్యం)కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బృహత్తరమైన ఈ పథకం ఆసియా ఖండంలోనే తొలి అత్యాధునిక సేద్య విధానంగా రికార్డులకెక్కనుంది. కర్ణాటక రాష్ట్రంలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ గ్రామంలో లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ పథకం కొనసాగుతోంది. దీన్ని రాంతాల్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కన్నా అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానంతో అనంతపురం జిల్లాలో ‘లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్’ అమలు కానుంది. క్లౌడ్ సీడింగ్ పద్ధతి తరహాలో పంటలకు నిర్దేశించిన మేరకే నీరు సరఫరా అయ్యాక, ఆటోమేటిక్‌గా డ్రిప్ సిస్టమ్ ఆగిపోయేలా ఈ పథకం ఏర్పాటవుతోంది. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో కరవు ప్రాంతాల్లో పంటల సాగుకు ఈ విధానం ఇతోధికంగా ఉపయోగపడనుంది. గత ఏడాది సెప్టెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం జీవో-54 విడుదల చేసింది. తద్వారా జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఉరవకొండ, బెళుగుప్ప, కూడేరు మండలాల పరిధిలోని 23 గ్రామాల్లో రూ.803 కోట్ల వ్యయంతో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించడం ఈ పథకం లక్ష్యం. జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్ కృషితో ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు యుద్ధప్రాతిపదికన జనవరి 8వ తేదీ ఆన్‌లైన్ గ్లోబల్ టెండర్లు పిలిచారు. శుక్రవారంతో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. శనివారం టెండర్లు తెరవనున్నారు. టెండరు దక్కించుకునే కంపెనీ, ప్రభుత్వ నిబంధనల మేరకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న రోజు నుంచి 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పథకానికి జిల్లాలోని పెన్నహోబిళం రిజర్వాయర్ (పీఏబీఆర్), జీడిపల్లి రిజర్వాయర్, మిడ్‌పెన్నార్ ప్రాజెక్టు(ఎంపీఆర్) రిజర్వాయర్ల నుంచి 50 నుంచి 100 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. ఆ నీటిని నిల్వ ఉంచేందుకు కౌకుంట్ల, జయపురం, కూడేరు, బెళుగుప్ప ప్రాంతాల్లో 4 భారీ ట్యాంకులు నిర్మించనున్నారు. ఒక్కో లోకేషన్ నుంచి 20 వేల హెక్టార్ల చొప్పున 5 వేల హెక్టార్ల సాగు భూమికి నీరందనుంది. నీటి పారుదల ద్వారా 5 టీఎంసీలు అవసరం. ఈ పథకం కింద కేవలం 2 టీఎంసీలతోనే పంటలు పండించుకోవచ్చు. వరి మినహా పొద్దుతిరుగుడు, వేరుశనగ, మిరప, ఉల్లి, నట్స్, వాణిజ్య పరంగా లాభదాయకమైన పండ్ల తోటలకు ప్రాధాన్యత ఉంటుంది. పంటల మార్పిడికి రైతుల్ని మళ్లించడం, కరవు ప్రాంతంలో నీటిని పొదుపుగా వాడుతూ సద్వినియోగ పర్చుకునేలా రైతుల్ని సమాయత్తం చేసేందుకు ఈ పథకం దోహద పడుతుందని హంద్రీ నీవా ఎస్‌ఈ రామకృష్ణారెడ్డి, 6వ డివిజన్ ఈఈ ఎం.మల్లికార్జునరెడ్డి అన్నారు.
ఈ పథకం అమలుకు 3 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 3 పంప్‌సెట్ల ద్వారా రోజుకు 16 గంటలు నిరంతరాయంగా 300 క్యూసెక్కుల మేరకు నీటిని పంపింగ్ చేస్తారు. ఒక్కో ఎకరాకు రూ.4.50 లక్షలు ఖర్చు కానుంది. ఏటా జూలై నుంచి డిసెంబర్ వరకు నీటిని సరఫరా చేసి పంటలకు నీటిని సరఫరా చేస్తారు. టెండర్లు ఖరారు కాగానే పనులు మొదలు కానున్నాయి.