బిజినెస్

ప్రోత్సాహకాలపై పరిశ్రమ వర్గాలు ఖుషీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 16: రెండున్నరేళ్ల కాలానికి సరిపడా ప్రోత్సాహకాలు, ఐదు సమావేశాల్లో ఐదు నెలల్లో ఆమోదం పొంది విడుదల కావడంతో పరిశ్రమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్‌జైన్ నేతృత్వంలో జరిగిన 18వ రాష్టస్థ్రాయి కమిటీ సమావేశంలో 81 యూనిట్లకు రూ.151.4 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. దీంతో కలిపి మొత్తం ఐదు సమావేశాల్లో, ఐదు నెలల్లో అందునా ఈ ఆర్థిక సంవత్సరంలో 771 క్లెయిములకు గాను రూ.801.61 కోట్లను విడుదల చేసినట్టయింది.
కమిషనర్ సిద్ధార్థ్ జైన్ 2017లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాతే ఆయన నేతృత్వంలోనే ఇంత వేగంగా ప్రోత్సాహకాలకు ఆమోదం లభించిందని సమావేశానికి హాజరైన పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అభినందించారు. ఈ ప్రోత్సాహకాలు పొందిన కంపెనీలు రెండున్నరేళ్ల కాలంలో 42,875 మందికి ఉద్యోగాలు కల్పించాయి.
తాజా సమావేశంలో ఇచ్చిన ప్రోత్సాహకాల్లో 63.51 శాతం ప్రోత్సాహకాలు విద్యుత్ చార్జీల రీయింబర్స్‌మెంట్‌కే కావడం గమనార్హం. విద్యుత్ చార్జీల రీయింబర్స్‌మెంట్‌కు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడం పరిశ్రమలకు మంచి రోజులనడానికి నిదర్శనమని స్పిన్నింగ్ మిల్స్ సంఘం, ఫ్యాప్సియా ప్రతినిధులు పేర్కొన్నారు. తరువాతి స్థానం రూ.43.62 కోట్ల విలువైన ప్రోత్సాహకాలతో అమ్మకం పన్ను రీయింబర్స్‌మెంట్‌కు లభించింది. విద్యుత్ ప్రోత్సాహకాలు పరిశ్రమల వృద్ధి రేటుకు సంకేతమని పరిశ్రమల సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ప్రోత్సాహకాల ఆమోదానికి, ఫిర్యాదులను కమిషనర్ పరిష్కరించిన విధానాన్ని గమనించిన ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ ఉపాధ్యక్షుడు ఈపీ పూర్ణచంద్రరావు, ఇంత వేగంగా క్లెయిములు పరిష్కారం కావడం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు.
ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ గండా ప్రసాద్ కూడా కమిషనర్ సిద్ధార్థ్‌ర్ధ్‌జైన్ తమకు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. గతంలో కంటే వేగంగా పరిశ్రమల స్థాపనకు ఆమోదం, క్లియరెన్స్‌లు లభిస్తున్నాయని అన్నారు. కమిషనర్ ప్రోత్సాహంతో తాము సీఎం ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు వచ్చే బడ్జెట్‌లో పరిశ్రమల క్లియరెన్స్‌లు, ప్రోత్సాహకాల కోసం రూ.3వేల కోట్లు కేటాయించాలని కోరామన్నారు. ఫ్యాప్సియా ఉపాధ్యక్షుడు, ఈపీపీసీ రావు, సీఐఐకి సంబందించి ఏపీ ఎంఎస్‌ఎంఈ సంఘం కన్వీనర్ వైవీ కృష్ణమోహన్, ఏపీ స్పిన్నింగ్ మిల్స్ చైర్మన్ గండా ప్రసాద్, ఏపీఐఐసీ ఓఎస్డీ ఎం.మురళీమోహన్, అమ్మకం పన్నుల కమిషనర్ ఎం.పంపాపతి, గిరిజన సంక్షేమశాఖలో డీజీఎం వి.శశికళ, ఏపీ ట్రాన్స్‌కో నుంచి ఏడీఈ సిహెచ్‌వి రమణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏఐజీ కె.సుశీల, సీసీఎల్‌ఏ కార్యాలయంలో సహాయ కార్యదర్శి ఎస్వీఎస్‌ఎస్ లక్ష్మి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.