AADIVAVRAM - Others

అదిరే ఫీచర్లతో ‘క్సియోమీ’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాకు చెందిన ప్రఖ్యాత మొబైల్ కంపెనీ ‘క్సియోమీ’ రెండు అధునాతన స్మార్ట్ఫోన్లను రంగంలోకి దించుతోంది. ఎంఐ మిక్స్-2ఎస్, ఎంఐ-7 అనే పేర్లతో ఇవి మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. ఎంఐ-7 రకం స్మార్ట్ఫోన్‌లో ప్రత్యేకతలకు సంబంధించి ఇప్పటికే కొన్ని వార్తలు వెలుగుచూశాయి. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు:
5.65 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే, 2160/1080 పిక్సెల్స్ రిజల్యూషన్, స్నాప్ డ్రాగన్ 845 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 16 16 మెగా పిక్సెల్ లెనె్సస్‌తో డ్యూయల్ రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ సింగిల్ సెన్సర్ సెల్ఫీ కెమెరా, 480 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఫోన్ వచ్చే ఏప్రిల్‌లో మార్కెట్‌లో ప్రవేశించే అవకాశం ఉంది. గత ఏడాది విడుదలైన ఎంఐ-6 ఫోన్‌ను అప్‌డేట్ చేస్తూ ఎంఐ-7ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లు..
5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే, 1920/1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యూయల్ సిమ్, 12 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్‌ప్రారెడ్ సెన్సర్, 4జీ ఎల్‌టీఈ డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎన్‌ఎఫ్‌సీ యూఎస్‌బీ టైప్ సీ, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
‘సెల్ బే’ సంచలన ఆఫర్లు
మొబైల్ రిటైల్ రంగంలో విస్తరిస్తున్న ‘సెల్ బే’ వార్షికోత్సవ ప్రత్యేక ఆఫర్లతో స్మార్ట్ఫోన్ ప్రియులకు వల వేసింది. 1,499 రూపాయలకే స్మార్ట్ఫోన్, 5వేల రూపాయలకు మించి కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక బహుమతులంటూ ఈ సంస్థ ప్రకటించింది. ‘సెల్ బే’ అందుబాటులో ఉంచిన పలు స్మార్ట్ఫోన్లు అనేక విశిష్ఠతలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. కొద్దిరోజుల్లో భారతీయ మార్కెట్‌లోకి అడుగిడబోతున్న ‘మిజు ఎం 6ఎస్’ 9,925 రూపాయలకు లభిస్తుంది. ఇందులోని ఫీచర్లు..
5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ 2.5డీ- కర్వ్‌డ్ గ్లాస్ డిస్ ప్లే, 1440/720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హెగ్జాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యూయల్ సిమ్, 16 మెగా పిక్సెల్స్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జీ వీవోఎల్‌టీఈ బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
హెచ్‌టీసీ యూ11ఐఎస్
ప్రస్తుతం తైవాన్‌లో విడుదలైన హెచ్‌టీసీ యూ11ఐఎస్ ఫోన్ త్వరలో భారత్‌లో ప్రవేశించబోతోంది. దీని ధర రూ. 32,020లుగా ఉంటుందని అంచనా. ఇందులోని విశిష్ఠతలు..
6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎల్‌సీడీ 3 డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ 3 భద్రత, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సీ, 4జీ ఎల్‌టీఈ డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3930 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0
టెక్నో కామన్ ఐ..
చైనాకు చెందిన టెక్నో మొబైల్ సంస్థ ‘టెక్నో కామన్ ఐ’ పేరిట ఓ స్మార్ట్ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ. 8,999లుగా ఉండవచ్చని అంచనా. త్వరలోనే భారత్‌లో ప్రవేశించబోయే ఈ ఫోన్‌లోని ప్రత్యేకతలు ఇవీ...
5.65 అంగుళాల హెచ్‌డీ ప్లస్ 2.5 డీ కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ ప్లే, 1440/ 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ, డ్యూయల్ సిమ్, 13 మెగా పిక్సెల్స్ బ్యాక్ కెమెరా, 13 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.
శ్యాంసంగ్ గెలాక్సీ జె8-2018
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శ్యాంసంగ్ కంపెనీ ‘గెలాక్సీ జె8- 2018’పేరిట ఓ సరికొత్త స్మార్ట్ఫోన్‌ను త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీని ధర వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. ఇందులోని ఫీచర్లు..
5.5 అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యూయల్ సిమ్, 13 మరియు 8 మెగా పిక్సెల్స్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
అల్కాటెల్ 3వీ.
అల్కాటెల్ తన కొత్త స్మార్ట్ఫోన్‌ను ‘అల్కాటెల్ 3వీ’ పేరిట తాజాగా విడుదల చేసింది. దీని ధర వివరాలు ఇంకా వెల్లడి కాకున్నా ఇందులోని ఫీచర్లు ఇలా ఉంటాయని అంచనా..
6 అంగుళాల ఫుల్ హచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్ ప్లే, 2160/1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ, డ్యూయల్ సిమ్, 16, 2 మెగా పిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జీ వీవోఎల్‌టీఈ బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.