AADIVAVRAM - Others

కేఫ్‌లో రోబోల ఆతిథ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాఫీ తాగడానికి ఆ కేఫ్‌కు వెళితే సర్వర్లు, వెయిటర్లతో పని లేదు. అక్కడి రోబోలే మనకు చక్కగా అతిథి మర్యాదలు చేసి ఆప్యాయంగా కాఫీ అందిస్తాయి. జపాన్ రాజధాని టోక్యోలోని డౌన్‌టౌన్ బిజినెస్ ఏరియాలో ‘హెన్నా కేఫ్’లో ‘కాఫీ ప్రేమికుల’కు రోబోలు స్వాగతం పలుకుతాయి. వెండింగ్ మిషన్ ద్వారా కస్టమర్లు కొనుగోలు చేసిన టిక్కెట్‌ను స్కాన్ చేయడం, రుచికరమైన కాఫీని కలిపి అందించడం వంటి పనులను రోబోలే చేస్తాయి. ఒకేసారి అయిదుగురికి సరిపోయే కాఫీని రోబో తయారుచేస్తుంది. ఈ కేఫ్‌లో ఒక కాఫీ ఖరీదు మన కరెన్సీలో 192 రూపాయలట! ఒక్క కాఫీయే కాదు.. గ్రీన్ టీ, హాట్ చాక్లెట్, కొన్ని ప్రత్యేకమైన హాట్ డ్రింక్‌లను కూడా రోబోలే ‘సర్వ్’ చేస్తాయి. ‘సాయర్’ అనే రోబో కలిపి ఇచ్చే కాఫీ గొప్ప రుచిగా ఉందంటూ కస్టమర్లు వేలం వెర్రిగా ఈ కేఫ్‌కు వస్తున్నారట! కాఫీ తాగడమే కాదు, ఈ రోబోలతో సెల్ఫీలు దిగేందుకు కస్టమర్లు తెగ ఇష్టపడుతున్నారు. టోక్యోలోని మరిన్ని ప్రాంతాల్లో ఈ తరహా కేఫ్‌లను తెరవాలని ‘హెన్నా కేఫ్’ యాజమాన్యం భావిస్తోందట!