డైలీ సీరియల్

వ్యూహం-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సర్.. మీరు ఇక్కడకు వచ్చారేమిటి? ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని గదా!’’ అన్నాడు హర్షవర్థన్ ఆయన్ను లేవదీస్తూ.
తన ఛాంబర్‌లోకి తీసుకువెళ్ళాడు. చల్లటి మంచినీళ్ళు త్రాగేక కుదుటపడ్డాడు దయానందరావు. కాన్ఫరెన్స్‌కు టైమ్ అవుతున్నా వెళ్ళకుండా ఛాంబర్‌లోనే మంత్రిగారు ఉండిపోవడంతో ‘మర్చిపోయారేమో! గుర్తుచేద్దాం!’ అనుకుంటూ లోపలికి వచ్చిన పియస్‌కు మంత్రిగారు ప్రొఫెసర్‌గారి నుదురు టవల్‌తో తుడుస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోయాడు.
‘‘వెంటనే వేడి వేడి కాఫీ పట్టుకురా గురువుగారికి’’ అన్నాడు హర్షవర్థన్ పిఎస్‌తో.
తను చేసిన పొరపాటు ఏమిటో తెలిసింది పిఎస్‌కు. ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో తనే కాఫీ కప్పుతో ఛాంబర్‌లోకి వచ్చి ప్రొఫెసర్‌గారికి ఇచ్చాడు.
కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పాడు దయానందరావు.
‘‘వీరెవరో తెలుసా?’’ అడిగాడు హర్షవర్థన్ పిఎస్‌వైపు తిరిగి.
‘‘ప్రమాణస్వీకారం చేసిన రోజు వీరింటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నాను. తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు.. అనాథ ఆశ్రమంలో చేర్చారు నన్ను నెలల పిల్లవాడిగా వున్నప్పుడే! ఆరేళ్ళ వయసులో అనాథ ఆశ్రమం వార్డెన్ సరిగ్గా భోజనం పెట్టడంలేదని అతనిమీద తిరగబడ్డాను. బయటకు నెట్టేశారు.. అడ్రస్ అంటూ లేనివాడిని.. రోడ్లమీద దుమ్ము ధూళిని నేస్తాలుగా చేసుకుని తిరుగుతూ వుంటే ప్రొఫెసర్‌గారు నన్ను ఇంటికి తీసుకువెళ్లి కడుపునిండా అన్నం పెట్టి ఇక్కడే ఉండిపో, బాగా చదువుకో అన్నారు. వారి మాటలే నాకు వేదవాక్కులు అయ్యాయి. ఈ స్థాయికి వచ్చానంటే వారి చేతి చలవే’’ అన్నాడు హర్షవర్థన్.
‘‘నువ్వు కష్టపడి పైకొచ్చావ్.. నేను చేసింది ఏముంది?’’ అన్నాడాయన.
‘‘ఏం పనిమీద వచ్చారు సార్’’ అడిగాడు హోమ్ మినిస్టర్.
జేబులోని స్కంద ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ మంత్రిగారి చేతిలో వుంచాడు దయానందరావు.
‘‘ఈ ట్రాన్సఫర్ ఆర్డర్ రిసెండ్ చేసుకో! వీలుంటే వెంటనే విత్‌డ్రా చెయ్యి’’ అన్నాడు ప్రొఫెసర్ కాఫీ తాగుతూ.
.. ఆ ఆర్డర్ కేసి చూశాడు. కేంద్ర మంత్రి గొంతుమీద కూర్చుని స్కందను ట్రాన్స్‌ఫర్ చెయ్యమని చెబితే ఇష్టం లేకపోయినా చేశాడు.. గురువుగారు చెప్పేక ఆ ఆర్డర్ వెనక్కు తీసుకోవాల్సిందే.
వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేశాడు. స్కంద ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ వెంటనే క్యాన్సిల్ చేసి ఆ ఉత్తర్వుల కాపీ గంట టైములో తన టేబుల్‌మీద ఉండాలని గట్టిగా చెప్పాడు.
ప్రిన్సిపల్ సెక్రటరీ స్కందను క్రైమ్ బ్రాంచ్‌లో అదే పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆ ఉత్తర్వుల నకలు మంత్రిగారికి పంపించాడు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫోన్ చేసి ఆ ఉత్తర్వులు వెంటిఒనే అందుకోవడానికి మనిషిని పంపించమని కబురు చేశాడు. డిజిపి ఆఫీసు స్పెషల్ మెసెంజర్ వచ్చి ఆ ఉత్తర్వులు అందుకుని డిజిపికి ఇచ్చేడు ఆఘమేఘాలమీద.
‘‘డిజిపి మీరు కోరుకున్నట్లుగా ఉత్తర్వులు అందాయి.. మీరు నిశ్చితంగా వెళ్లండి మాస్టారూ’’ అన్నాడు హర్షవర్థన్ దయానందరావుతో.
***
డిజిపికి అంతా ఆశ్చర్యంగా వుంది.
‘‘స్కంద సిన్సియర్ ఆఫీసరు.. గుడ్ సమారిటన్ హాస్పిటల్ మీద ఆరోపణలు వస్తున్నాయి... వాటిని స్కంద ఇనె్వస్టిగేట్ చేస్తున్నాడు.. అతన్ని ట్రాన్స్‌ఫర్ చేసి చికాకు పర్చడం మంచిది కాదు’’ అని చెప్పాడు మంత్రిగారికి పర్సనల్‌గా కలిసి.
మంత్రిగారు తన మాటలు పట్టించుకోలేదు.
సీన్ రివర్స్ అయ్యింది.. మంత్రిగారే స్వయంగా ఫోన్ చేసి స్కందను అదే స్థానంలో కొనసాగమని ఉత్తర్వులు జారీచేశారు.
స్కందను పిలిచి గుడ్ విషెస్ చెప్పాడు డిజిపి
గుడ్ సమారిటన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గల్ఫ్ కంట్రీస్, పాకిస్తాన్, ఇండియాలో విస్తరించి వున్నాయి. వంద లకోట్ల ఆస్తిపాస్తులు వున్నాయి.
సమారిటన్ గ్రూప్ హాస్పిటల్స్ ఎనభైశాతం హాస్పిటల్స్ సక్రమంగానే నడుస్తున్నాయి. వాటికి మంచి పేరు వుంది. అన్ని హాస్పిటల్స్ కేంద్ర స్థానం దుబాయ్‌లో వుంది.
అరిఫ్ ఆ హాస్పిటల్స్ అన్నింటికి చైర్మన్. ఇరవై ఏళ్ళనుంచి అతడే చైర్మన్‌గా కొనసాగుతూ వున్నాడు. అయితే అరిఫ్ డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపేశాక పరిస్థితులు మారేయి. కొన్ని హాస్పిటల్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు, రోగులకు తెలియకుండా అవయవాల మార్పిడి మొదలయ్యాయి.
అరిఫ్‌కు అరవై తొమ్మిదేళ్ళు వచ్చాయి. అతన్ని చైర్మన్ పదవినుంచి తప్పించాలని కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అరిఫ్ కార్యకలాపాలవల్ల అన్ని హాస్పిటల్స్ అపఖ్యాతి వస్తుందేమోనని వాళ్ళ భయం.
బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో మొత్తం పదిమంది డైరెక్టర్స్ వున్నారు. ఎనిమిదేళ్ళనుంచి అరిఫ్ కొడుకు అనాజ్ హుస్సేన్ ఆ బోర్డులో మెంబరు. నీతి, నిజాయితీ వున్న వ్యక్తి. అతనికే పట్టం కట్టాలని బోర్డులోని మెజారిటీసభ్యులు అభిప్రాయపడుతూ వుండేవాళ్ళు. కానీ అనాజ్ తండ్రి పట్ల వున్న గౌరవభావం వాళ్ళ ప్రయత్నాలకు బ్రేకులు పడుతూ వుండేవి.

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ 47