డైలీ సీరియల్

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ కమలలోచన నన్ను గన్నతండ్రివి గాన
నిన్ను నేమఱకుంటి నేను విడక
ఉదరపోషణకునై యొకరి నేనాసింప
నేర నా కన్నంబు నీవు పెట్టు
పెట్టలేనంటివా పిన్నపెద్దలలోనఁ
దగవు కిప్పుడు దీయఁదలఁచినాను
ధనము భారంబైనఁ దల కిరీటము నమ్ము
కుండలమ్ములు పైడి గొలుసులమ్ము

తే॥ కొసకు నీ శంఖచక్రముల్ కుదువఁబెట్టి
గ్రాసము నొసంగి పోషించు కపట ముడిగి
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహస్వామీ! పద్మనేత్రా! నాకు జన్మనిచ్చిన తండ్రివి నీవే. అందువల్ల నినే్న నమ్ముకున్నాను. పొట్టపోసుకోవటానికి నేనెవ్వరి పంచనుఁజేరను. నీవే నాకన్నం పెట్టాలి. పెట్టలేకపోయావో చిన్నవారిలోకి, పెద్దల్లోకి తగవుకు పిలుస్తాను. నాకు తిండి పెట్టడం నీకు కష్టమైతే కిరీటం, కుండలాలు, బంగారు హారాలు, శంఖచక్రాలు కుదువబెట్టి నన్ను పోషించు.