జాతీయ వార్తలు

త్రిపుర ప్రశాంతం పోలింగ్ 74శాతం నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఆదివారం జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా 17 శాతం తక్కువగానే ఈసారి పోలింగ్ నమోదైందని వెల్లడించింది. మొత్తం 60 స్థానాల్లో 52 సీట్లకుగాను ఆదివారం ఎన్నికలు జరిగాయి. సీపీఎం అభ్యర్థి రామచంద్రనారాయణ దేవ్ మృతి కారణంగా చరిలాం నియోజకవర్గంలో ఎన్నికలు జరగలేదు. ఈ నియోజకవర్గానికి మార్చి 12న ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 25ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో వున్న వామపక్షాలను గద్దెదింపి రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకోవడానికి బీజేపీ అధినాయకత్వం అహరహం శ్రమించింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా అగ్రనేతలంతా ఈ ఎన్నికల్లో విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించి, బీజేపీ నెగ్గితేనే రాష్ట్భ్రావృద్ధి అన్న బలమైన సంకేతాలు అందించారు. ఇప్పటికే ఐపీఎఫ్‌టి అనే స్థానిక పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అధికారం తమదేనన్న ధీమాతోవుంది. 51 స్థానాలకు బీజేపీ పోటీ చేస్తే, మిగిలిన 9 స్థానాలకు ఈ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 59 సీట్లకు ఒంటరి పోరు చేసింది.

గోమతి జిల్లాలోని కక్రాబాన్ నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టలేదు.

chitram...
త్రిపుర రాజధాని అగర్తలాలో ఓ పోలింగ్ బూత్ వద్ద బారులుతీరిన ఓటర్లు