జాతీయ వార్తలు

21న కమల్ కొత్త పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 18: మరో మూడు రోజుల్లో ప్రసిద్ధ నటుడు కమల్‌హాసన్ కొత్త పార్టీ ఆవిష్కృతం కాబోతోంది. ఇందుకు సంబంధించి ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. తమిళ సినీరంగంలో కోట్లాదిమంది అభిమానుల బాసట కలిగిన వీరిద్దరూ సమావేశం కావడంతో రాజకీయంగా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న సంకేతాలూ వ్యక్తమయ్యాయి. అయితే, రజనీకాంత్‌ను మర్యాద పూర్వకంగానే కలుసుకున్నానని, ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని కమల్‌హాసన్ వివరించారు. రజనీని కలుసుకుని తన నిర్ణయం గురించి తెలిపానని, తన రాజకీయ ప్రయాణం మొదలుకాకముందు కీలకమైన వ్యక్తులు, సన్నిహితులను కలుస్తున్నానని కమల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు కమల్‌హాసన్ సేవ చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఆయనకు విజయం చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని రజనీకాంత్ అన్నారు. పేరు కోసమో, డబ్బు కోసమో కమల్ రాజకీయాల్లోకి రావడం లేదని, బలమైన సేవాభావమే ఆయనను రాజకీయాల్లోకి తీసుకొస్తుందని రజనీ తెలిపారు. రాజకీయాల్లోనే కాదు సినిమాల్లో కూడా కమల్ స్టయిల్ వేరు, నా స్టయిల్ వేరని వ్యంగ్యోక్తి విసిరారు. రాష్ట్రానికి మరింతగా సేవ చేయడానికి రజనీతో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు ‘మేం చేతులు కలుపుతామా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది’ అని కమల్ అన్నారు.