రాష్ట్రీయం

ఆకట్టుకున్న కోస్ట్‌గార్డ్ విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 18: ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో ఆదివారం నిర్వహించిన డే ఎట్ సీ కార్యక్రమం సాహసోపేతంగా సాగింది. తూర్పు తీర ప్రాంతంలో నిత్యం గస్తీ నిర్వహించే కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో చేసిన సాహస కృత్యాలు చూపరులకు గగుర్పాటు కలిగించాయి. విశాఖ తీరం నుండి వచ్చిన ఐసిజిఎస్ షానక్ అనే నౌక, హెలీకాప్టర్ల సహాయంతో సైనికులు విన్యాసాలు చేశారు. ఏంటీ షిప్, ఏంటీ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైరింగ్, రోప్ సహాయంతో నిర్వహించిన సాహస కృత్యాలు ఆకట్టుకున్నాయి. అత్యాధునిక షానక్ నౌకలో ఇంటిగ్రేటెడ్ మిషనరీ కంట్రోల్ సిస్టం, పవర్ మేనేజిమెంట్ సిస్టం వంటి సౌకర్యాలున్నట్టు కోస్ట్‌గార్డ్ కాకినాడ కమాండెంట్ పి శ్యామ్‌కుమార్ వివరించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, సంయుక్త కలెక్టర్ ఎ మల్లికార్జున, పోర్టు డైరెక్టర్ కె ప్రవీణ, కస్టమ్స్ సంయుక్త కమిషనర్ (కాకినాడ) నరసింహారెడ్డి తదితరులు డే ఎట్ సీ కార్యక్రమంలో పాల్గొన్నారు.